Shankar: కమల్ హాసన్‌కు భారీ ట్విస్ట్… ఆగిపోయిన ఇండియన్ 2 షూటింగ్ ?

లోకనాయకుడు కమల్ హాసన్ నుంచి వచ్చిన సినిమాల్లో భారతీయుడు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. 27 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం అప్పట్లోనే 50 కోట్లు వసూళ్లు చేసి, బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించడమే కాదు… ఇప్పటికి అందరికి గుర్తుండిపోయింది. దీనికి సీక్వెల్ గా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి విధితమే. మధ్యలో సినిమా షూటింగ్ సమయంలో ఒక ప్రమాదం జరగడంతో తాత్కాళికంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ గతేడాది సెప్టంబర్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ ను జరుపుకుంటుంది.

శంకర్ ఇటు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ చేస్తూనే, అటు భారతీయుడు2 షూటింగ్ ను కొనసాగించాడు. కానీ, ప్రస్తుతం గేమ్ ఛేంజర్ కంటే భారతీయుడు2పై ఎక్కువ ఫోకస్ పెట్టి, ఆ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగా చెన్నై ఏయిర్ పోర్ట్ లో ఒక కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. అందుకోసం ఏయిర్ పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, డిపార్చర్ ప్రాంతంలో అనుమతులు కూడా తీసుకున్నారు. ఈ అనుమతుల కోసం చిత్ర యూనిట్ ఏకంగా 24 లక్షలు ఖర్చు చేసిందని టాక్.

అంత పకడ్భందీతో చేస్తున్న ఈ షెడ్యూల్ ఆగిపోయిందని తెలుస్తుంది. సన్నివేశంలో భాగంగా చెన్నై ఏయిర్ పోర్ట్ లోని లావటరీ ప్రాంతంలో కూడా షూటింగ్ చేయాల్సి వచ్చిందట. కానీ, భారతీయుడు2 యూనిట్ అక్కడికి వెళ్లడానికి అనుమతులు లేవు. దీంతో ఏయిర్ పోర్ట్ నిర్వహకులు షూటింగ్ ను అడ్డుకున్నారని టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ షెడ్యూల్ మధ్యలో ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా, సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్న భారతీయుడు2 యూనిట్ కి ఇలా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు