Prabhas: ఆదిపురుష్ మెడకు మరో వివాదం… విభీషణుడి భార్య ఉండేది అలాగేనా ?

బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకున్న ఆదిపురుష్ ను ట్రోలర్స్ వెంటాడి వేధిస్తున్నారు. ఇప్పటికే అనేక వివాదల్లో చిక్కుకున్న ఈ చిత్రాన్ని మరింతగా ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాలో ఉన్న తప్పులను గుర్తించి మరీ ట్రోల్స్ చేస్తున్నారు. వివాదాస్పదం చేస్తున్నారు. ఇప్పటికే రాముడు, రావణుడి లుక్స్, హనుమంతుడి డైలాగ్స్, సినిమాలో క్యారెక్టర్స్ పేర్లు ఇలా చాలా వాటిపై ట్రోల్స్ చేస్తున్నారు. అంతే కాదు… ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ కూడా వినిపిస్తుంది.

దీనిపై చిత్రానికి డైలాగ్స్ అందించిన మనోజ్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని లేపుతున్నాయి. ఆదిపురుష్ రామాయాణాన్ని ఆదారంగా చేసుకుని చేసిన సినిమా కాదని, హన్మంతుడు అసలు దేవుడు కాదని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. అంతే కాకుండా, ఆదిపురుష్ ను బ్యాన్ చేయాలి అనే డిమాండ్ మరింతగా వినిపిస్తుంది. ఇది ఇలా ఉండగానే ఆదిపురుష్ పై ఇప్పుడు తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది.

సినిమాలో లంకా యుద్ధానికి ముందు రాముడి వద్దకు రావణాసుర సోదరుడు విభీషనుడు వస్తాడు. ఆ సమయంలో విభీషనుడు భార్య పాత్ర కూడా ఉంటుంది. ఆమె పాత్ర డిజైన్ ను డైరెక్టర్ ఓం రౌత్ మరీ దారుణంగా చేశారని నెటిజన్లు అంటున్నారు. దాదాపు అర్థనగ్నంగా ఉన్నట్టు ఆమె పాత్ర ఉంటుందని అంటున్నారు. పవిత్రమైన రామాయణంలో, ధర్మంగా ఉండే విభీషనుడు భార్యను అలా చూపించడంపై మండిపడుతున్నారు. ఆమె పాత్ర అసభ్యకరంగా ఉన్న సీన్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు