Prashanth neel: సలార్ విధ్వంసం ఇప్పటినుండే మొదలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు కసి మీదున్నాడు. ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవడడంతో తొందర్లోనే ఒక భారీ బ్లాక్ బస్టర్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. పైగా ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన అన్ని సినిమాలు డిఫరెంట్ జోనర్ సినిమాలే. సాహో మాఫియా డాన్ నేపథ్యమున్న సినిమా అయితే, రాదే శ్యామ్ ప్యూర్ లవ్ స్టోరీ డ్రామా. ఇక లేటెస్ట్ గా వచ్చిన “ఆదిపురుష్” రామాయణ ఇతిహాస కథ ఆధారంగా తీసిన మైథలాజికల్ డ్రామా.

ఈ డిఫరెంట్ జోనర్ సినిమాలతో ఖంగుతిన్న ప్రభాస్ ఇప్పుడు మళ్ళీ పాత రెబల్ స్టార్ గా మారనున్నాడు. తనకు అచ్చొచ్చిన మాస్ జోనర్ లో ప్రశాంత్ నీల్ తో కలిసి రానున్నాడు ప్రభాస్. ప్రభాస్ ఇంతకు ముందు నటించిన ఛత్రపతి, మిర్చి లాంటి సినిమాలు ఏ స్థాయి విజయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రాలతో ప్రభాస్ మాస్ హీరోగా తెలుగులో అశేషమైన జనాదరణ పొందాడు. భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ ఇప్పుడు తన మాస్ పవర్ ని చూపడానికి రెడీ అవుతున్నాడు.

ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి వస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ గా డాన్ లాగా మారబోతున్నాడని రిలీజ్ అయిన పోస్టర్ల ద్వారానే తెలుస్తుంది. ఇక ఈ సినిమా కథ ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ అయిపోగా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.

- Advertisement -

తాజాగా సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తూ సలార్ రిలీజ్ కి 100రోజులే ఉంది అని ఒక పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ వంద రోజుల్లో సినిమా షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేసి సెప్టెంబర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. ఇక ఈ సలార్ సినిమా యొక్క టీజర్ ని జులై మొదటి వారంలో రిలీజ్ చేయనున్నారని చిత్ర యూనిట్ నుండి సమాచారం అందింది. అంటే సలార్ టీజర్ రిలీజ్ అయిన రోజు నుండే చిత్ర ప్రమోషన్ల తో ఆడియన్స్ దృష్టిలో క్రేజ్ తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అన్నీ సరిగ్గా కుదిరితే సెప్టెంబర్28 న రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు