Trisha Krishnan: నయన్, త్రిషలను మనోళ్లు భరించలేకపోతున్నారా?

సౌత్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో నయనతార, త్రిష హవా ఎక్కువగా నడుస్తోంది. అయితే ఈ ఇద్దరు హీరోయిన్లను టాలీవుడ్ మేకర్స్ భరించలేకపోతున్నారా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. నయన్, త్రిషలను భరించలేక మన తెలుగు నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారట.

ఈ ఇద్దరు సీనియర్ హీరోయిన్లకు ఇప్పటికీ మార్కెట్లో సూపర్ క్రేజ్ ఉంది. ఇప్పటికే దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ ఇద్దరూ రోజు రోజుకు మరింత అందంగా తయారవుతున్నారు. పైగా వారికి ఇంతకుముందున్న క్రేజ్ కంటే ఇప్పుడున్న ఫాలోయింగ్ ఎక్కువ అని చెప్పాలి. అందుకే ఇంకా కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ అందుకోగలుగుతున్నారు. అంతేకాదు వీరి రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉంది. దీంతో నయనతార, త్రిషలను తెలుగు నిర్మాతలు భరించలేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది.

సాధారణంగా హీరోయిన్ల వయసు పై పడుతున్న కొద్ది ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ రావడం చాలా కష్టం. నయనతార, త్రిషలతో కలిసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మిగతా హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఈ ఇద్దరు హీరోయిన్లు మాత్రం పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ హీరోయిన్లుగా మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. వీరిద్దరికీ ఇప్పటికీ పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వస్తుండడమే అందుకు నిదర్శనం.

- Advertisement -

ఈ నేపథ్యంలో కొంతమంది తెలుగు ప్రొడ్యూసర్స్ కూడా వారిని సంప్రదించారట. కానీ ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు 10 కోట్ల కంటే ఎక్కువ పారితోషికాన్ని అడుగుతుండడంతో, మన ప్రొడ్యూసర్స్ అంత పెద్ద మొత్తంలో చెల్లించుకోలేక, వీళ్లను మనం భరించలేం అనుకుంటూ వెనుదిరుగుతున్నారట. ఇక నయన్, త్రిష ప్రస్తుతం తమ రెమ్యూనరేషన్ విషయంలో కచ్చితంగా ఉంటున్నారట. పారితోషికం విషయంలో ఏమాత్రం బేరాలు ఆడటానికి రెడీగా లేరని సమాచారం. దీంతో వాళ్లని తమ సినిమాల్లో తీసుకోవాలి అని అనుకుంటున్న తెలుగు దర్శక నిర్మాతలు వెనక్కి తగ్గక తప్పడం లేదు.

ఇంకేముంది ఈ హీరోయిన్లు ఇద్దరూ కెరీర్ పీక్స్ లో ఉండగానే, తమ క్రేజ్ కు తగ్గ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను అప్లై చేస్తున్నారు. కాగా విజయ్ హీరోగా నటించిన ‘లియో’ మూవీలో త్రిష హీరోయిన్ గా కనిపించింది. అలాగే జవాన్ అనే రీసెంట్ బ్లాక్ బస్టర్ లో నయనతార బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో రొమాన్స్ చేసింది. ఈ రెండు సినిమాలు మంచి హిట్ అవడంతో త్రిష, నయనతార తమ పారితోషికాన్ని అమాంతంగా పెంచేశారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు