Types of Relationships: రిలేషన్షిప్స్ ఎన్ని రకాలో తెలుసా? ఇందులో మీది ఏ రిలేషన్షిప్?

రిలేషన్షిప్ అనే మాట మనం ప్రతిరోజు వినేదే. అది ఎలాంటి రిలేషన్ అయినా కావచ్చు. సాధారణంగా రిలేషన్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే సంబంధం లేదా పాజిటివ్ కనెక్షన్ అని చెప్పొచ్చు. అది భార్యాభర్తల బంధం అయినా కావచ్చు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉండే బంధం, లవర్స్ మధ్యన ఉండే బంధం ఇలా ఏదైనా కావచ్చు. అయితే రిలేషన్ షిప్స్ అంటే బేసిగ్గా కుటుంబ బాంధవ్యాలు, స్నేహం, పరిచయాలు, శృంగార సంబంధాలు, వర్క్ రిలేషన్స్, సిచువేషన్ షిప్స్ అంటే సందర్భానుసార సంబంధాలు ఉంటాయి. ఈ వివిధ రకాల సంబంధాల మధ్య సానిహిత్యం పరంగా మార్పులు ఉంటాయి. ఇక ప్రతి ఒక్కరి జీవితంలో మనం పైన చెప్పుకున్న అన్ని రిలేషన్స్ కచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు రిలేషన్ షిప్స్ లోని రకాలు, వాటికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

1. ప్లాటోనిక్ రిలేషన్స్
ఈ రకమైన రిలేషన్ లో సెక్స్ లేదా రొమాన్స్ కు చోటు లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య మంచి స్నేహబంధం ఉంటుంది. ఆ ఇద్దరి మధ్య సానిహిత్యం, అభిమానం, అవగాహన, గౌరవం, నిజాయితీ అనేవి ఉంటాయి. ఇక ఈ రిలేషన్ రాను రాను లైంగిక సంబంధంగా కూడా మారవచ్చు.

Types of Relationships

- Advertisement -

2. రొమాంటిక్ రిలేషన్ షిప్స్
శృం*ర సంబంధాలు అంటే ఇద్దరి మధ్య ప్రేమ, మోహం, సాన్నిహిత్యం ఉంటాయి. ఇలాంటి రిలేషన్ షిప్స్ ఉన్నవారు తర్వాత లవర్స్ గా కూడా మారే ఛాన్స్ ఉంటుంది. రొమాంటిక్ రిలేషన్ షిప్స్ కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. స్టార్టింగ్ లో ఇద్దరు సాధారణంగా తమ అభిరుచులు, భావాలు కలవడం వంటి ఫీలింగ్స్ ను ఫీల్ అవుతారు. ఆ తర్వాత వారి రిలేషన్ మరింత స్ట్రాంగ్ అవుతుంది.

types-of-relationships

3. కో డిపెండెంట్ రిలేషన్షిప్స్
ఈ రకమైన రిలేషన్ లో భాగస్వామిపై భావోద్వేగంగా లేదా శారీరకంగా మానసికంగా ఆధారపడుతూ ఉంటారు. అంటే ఏదైనా పని చేయాలంటే అనుమతి అడగడం, ఎవరైనా మీకు అసౌకర్యాన్ని కలిగిస్తే, వెంటనే మీకు సంతోషం కలిగించే పనులు చేయడం వంటివి.

types-of-relationships

4. క్యాజువల్ రిలేషన్షిప్స్
క్యాజువల్ రిలేషన్షిప్స్ అంటే తరచుగా డేటింగ్ రిలేషన్షిప్స్ కలిగి ఉంటారు. ఎలాంటి ఆలోచన లేకుండా S*X లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు వన్ నైట్ స్టాండ్, బూటి కాల్స్, S*X బడ్డిస్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని చెప్పొచ్చు.

types-of-relationships

6. ఓపెన్ రిలేషన్ షిప్స్
ఈ రకమైన రిలేషన్షిప్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఇతర వ్యక్తులతో S*X సంబంధాలను కలిగి ఉంటారు. ఇతర వ్యక్తులతో సెక్స్ చేయడానికి అంగీకరిస్తారు. కానీ కొన్ని షరతులు లేదా పరిమితులు పెడతారు.

types-of-relationships

7. టాక్సిక్ రిలేషన్షిప్
ఈ రకమైన రిలేషన్షిప్ మిమ్మల్ని భావోద్వేగం పరంగా, శారీరకంగా లేదా మానసికంగా బలహీనపరిచేలా ఉంటుంది. ఈ రిలేషన్ షిప్ లో మీ భాగస్వామి నుంచి సపోర్ట్ లేకపోవడం, నిందలు వేయడం, పోటీ తత్వం, ప్రవర్తనను నియంత్రించడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు