Polimera-2: హీరోయిన్ బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా..గ‌తంలో ఏం చేసిందంటే..?

ఈ మ‌ధ్య హ‌ర్ర‌ర్ సినిమాల హ‌వా కనిపిస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన మ‌సుధ సూప‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. అదే విధంగా మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన విరూపాక్ష కూడా మంచి విజ‌యం సాధించింది. ఇక ఎలాంటి అంచ‌నాలు లేకుండా గ‌తంలో ఓటీటీలో వ‌చ్చిన పొలిమేర సినిమా కూడా సూప‌ర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

దాంతో ఈ సినిమా సెకండ్ పార్ట్ పొలిమేర‌2 పై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా స‌త్యం రాజేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించాడు. అంతే కాకుండా ఫీమేల్ లీడ్ రోల్ లో కామాక్షి భాస్క‌ర్ల న‌టించారు. పొలిమేర 2 త‌ర‌వాత ఈ అమ్మ‌డి న‌ట‌న‌కు ఎంతో గుర్తింపు వ‌చ్చింది. ఈ సినిమాలో గ్రామీణ నేప‌థ్యం ఉన్న పాత్ర‌లో న‌టించ‌డమే కాకుండా ఆ పాత్ర‌కు తానే స‌రితూగుతాన‌ని నిరూపించుకుంది.

దాంతో కామాక్షి భాస్క‌ర్ల గురించి తెలుసుకోవాల‌ని ప్రేక్ష‌కులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా ఓ ఇంట‌ర్వ్యూలో కామాక్షి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. కామాక్షి గ‌తంలో చైనాలో మెడిసిన్ పూర్తి చేసిన‌ట్టు చెప్పింది. అంతే కాకుండా సినిమాల్లోకి రాక‌ముందు అపోలో ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్ గా కూడా ప‌నిచేసిన‌ట్టు వెల్ల‌డించింది. డాక్ట‌ర్ గా ప్రాక్టీస్ చేస్తూనే మోడ‌లింగ్ లో రానించగా సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని చెప్పింది. అంతేకాకుండా తాను ఎవ‌రితోనూ ఎక్కువ‌గా మాట్లాడ‌న‌ని పార్టీల‌కు ఫంక్ష‌న్ల‌కు దూరంగా ఉంటాన‌ని తెలిపింది.

- Advertisement -

ఎక్కువ ప‌రిచ‌యం ఉన్న‌వారితోనే కాస్త చ‌నువుగా ఉంటాన‌ని చెప్పింది. అలా ఉండ‌టం వ‌ల్ల ఇండ‌స్ట్రీలో ఎక్కవకాలం ఇమ‌డ‌లేవు అంటూ త‌న స్నేహితులు చెబుతుంటార‌ని కానీ అలా వింటూనే ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చాన‌ని తెలిపింది. ఇదిలా ఉంటే కామాక్షికి పొలిమేర‌-2 త‌ర‌వాత స్టార్ హీరోల సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌స్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి విశిష్ఠ కాంబినేష‌న్లో రాబోయే సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ని కూడా ఇండ‌స్ట్రీలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై ఇంకా అధికారిక ప్ర‌కట‌న రాలేదు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు