Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ – రెజీనాల లవ్ బ్రేకప్ కి కారణం ఆ హీరోనేనా..?

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోలలో మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఒకరు. పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు సాయిధరమ్ తేజ్. ఆ తర్వాత కొన్ని సినిమాలు హిట్ టాక్ ని అందుకోగా.. మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. ఆ మధ్య రోడ్డు ప్రమాదానికి గురైన తేజ్.. ఆ తరువాత విరూపాక్ష, బ్రో సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే గతంలో సాయిధరమ్ తేజ్ – హీరోయిన్ రెజీనా ప్రేమలో పడ్డారని, అంతేకాదు వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని మీడియా కోడై కూసింది.

వీరిద్దరి కాంబినేషన్ లో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలు వచ్చాయి. అయితే వీరి మధ్య ప్రేమయాయనం అలా కొనసాగుతున్న సమయంలోనే ఉన్నట్టుండి వీరిద్దరికీ బ్రేకప్ అయిందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరు బ్రేకప్ చెప్పుకోవడానికి కారణం ఓ హీరో అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఆ హీరో మరెవరో కాదు సందీప్ కిషన్. సందీప్ కిషన్ తో రెజీనా రొటీన్ లవ్ స్టోరీ, మహానగరం, నక్షత్రం, రారా కృష్ణయ్య వంటి చిత్రాలలో నటించింది.

ఈ సినిమాలలో నటించే సమయంలోనే వీరి మధ్య ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే విధంగా రిలేషన్ ఉండేదట. అంతేకాదు వీరిద్దరూ కలిసి నటించిన నక్షత్రం అనే సినిమాలో సాయిధరమ్ తేజ్ ఓ గెస్ట్ రోల్ చేయడం గమనార్హం. ఈ గెస్ట్ రోల్ చేసే సమయంలోనే సందీప్ కిషన్ – రెజీనా మధ్య ఉన్న ప్రేమ విషయం తేజ్ కి తెలిసిపోవడంతో అప్పటినుండి రెజీనాని దూరం పెట్టారట. అలా వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు