Kajal Aggarwal: నా భర్త ఆ విషయంలో బాగా వీక్.. షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్ అగర్వాల్..!

కాజల్ అగర్వాల్.. పరిచయం అక్కర్లేని నిండు చందమామ. ఈ ముద్దుగుమ్మ ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. మొదట ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీ కళ్యాణం, చందమామ వంటి సినిమాల నుండి ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి హీరోయిన్ గా స్టార్డం సంపాదించింది. ఇప్పుడు తల్లి అయిన తర్వాత మళ్ళీ సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చింది. రావడం రావడమే బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.

అలాగే పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటిస్తుంది. ప్రస్తుతం భారతీయుడు 2, సత్యభామ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సత్యభామ సినిమాలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది కాజల్. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

మీకు పెళ్లి జరిగి ఇన్ని రోజులు అయింది కదా..! మీ ఇద్దరిలో ఎవరు రొమాంటిక్ యాంకర్ ప్రశ్నించగా..? దీనికి కాజల్ సమాధానం ఇస్తూ.. తానే రొమాంటిక్ అని చెప్పుకొచ్చింది. తన భర్త గౌతమ్ రొమాన్స్ లో చాలా వీక్ అని తెలియజేసింది కాజల్. అయితే కాజల్ ఇలా భర్త గురించి పబ్లిక్ గానే ఓపెన్ గా చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు సైతం షాక్ కి గురవుతున్నారు. పెళ్లి జరిగిన తర్వాత కూడా ఇలా చాలా బోల్డ్ గా కామెంట్స్ చేయడం ఏంటని అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు