Vaishnavi Chaitanya: బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో..!

చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ గా నిలిచిన సినిమాలలో బేబీ సినిమా కూడా ఒకటి. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండ తో పాటు హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య కనబరిచిన నటనకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రానికంటే ముందు షార్ట్ ఫిలిమ్స్, సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు లైన్ కడుతున్నాయి.

అంతేకాదు ఈ భామ మరో తెలుగు హీరోయిన్ శ్రీలీలకు గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఓ స్టార్ హీరో వైష్ణవి చైతన్యకు ఊహించని గిఫ్ట్ పంపించారట. ఈ న్యూస్ ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ హీరో మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ ఏకంగా 20 లక్షల రూపాయల చెక్ ని వైష్ణవి చైతన్యకు పంపించినట్లు ఓ వార్త వైరల్ గా మారింది. అయితే దీనికి ఒక కారణం ఉందట. అల్లు అర్జున్ ఇన్పుట్స్ తో త్వరలో ఆయన సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ లో వైష్ణవి ప్రధాన పాత్రలో ఓ సినిమా వస్తోందట.

ఈ క్రమంలోనే ఆమెకు అడ్వాన్స్ రూపంలో బన్నీ ఈ చెక్ పంపించారని తెలుస్తుంది. ఇక ఆ చెక్ అందుకున్న వైష్ణవి ఆనందంతో పరవశంలో తేలిపోతుందట. వైష్ణవి చైతన్య అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురం సినిమాలో హీరోకి చెల్లెలి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆమె నటించిన బేబీ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ లో భాగంగా అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రావాలి అని, తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు