Sai Dharam Tej Love: మెగా ఫ్యామిలీకి కోడలుగా మరో స్టార్ హీరోయిన్..?

చాలా కాలం పాటు ప్రేమలో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా మెగా కుటుంబానికి కోడలు కాబోతుందా..? అనే చర్చ తెలుగు ఫిలిం నగర్ లో జరుగుతోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రీతు వర్మ. అవును త్వరలోనే ఈమె కూడా మెగా ఇంటి కోడలు కాబోతోందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

రీతు వర్మ కెరియర్ ప్రారంభంలో బాద్ షా వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి.. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు వంటి చిత్రాలతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమాలు హిట్ అయినప్పటికీ ఈ అమ్మడి కెరీర్ స్లోగానే సాగుతూ వచ్చింది. మళ్లీ ఇప్పుడిప్పుడే ఈ అమ్మడు తెలుగులో మెల్లగా బిజీ అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో రీతూ వర్మ ఎక్కువగా మెగా ఫ్యామిలీలో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అసలు సంబంధంలేని కుటుంబానికి సంబంధించిన పార్టీలలో ఈమె పాల్గొనడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అయితే రీతు వర్మ లవ్ చేస్తున్న మెగా హీరో ఎవరు అనే చర్చ కూడా జరుగుతుంది. సుప్రీం హీరోగా ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతున్న సాయి ధరమ్ తేజ్ అమ్మాయిలకు ఎప్పుడు కాస్త దూరంగానే ఉంటాడు. కానీ, రీతు వర్మ విషయంలో మాత్రం ఈ మెగా హీరో కొంచెం క్లోజ్ గానే ఉంటున్నాడట. ఈ క్లోజ్ అనేది ప్రేమ వరకు వచ్చిందని టాక్. అంతే కాదు, మెగా ఫ్యామిలీ ఈ విషయం తెలిసిందట. రీతు వర్మ పద్దతిగా ఉంటుంది కాబట్టి, మెగా ఫ్యామిలీ కూడా ఈ జంటకు అడ్డు చెప్పలేదని సమాచారం.

- Advertisement -

అలా మెగా ఫ్యామిలీ నుంచి పచ్చ జెండా రావడంతో కుటుంబంలో ఏ పార్టీ జరిగినా, రీతు వర్మను ఇన్వైట్ చేస్తున్నాడట సాయి ధరమ్ తేజ్. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇది నిజం కాదు.. రూమరే అని తెలియాలంటే, సాయి ధరమ్ తేజ్ గానీ, రీతు వర్మ గానీ, స్పందించాల్సిందే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు