Spark: లెజెండ్ ని బీట్ చేసేలా ఉందట.. నిజమేనా?

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో “స్పార్క్” కూడా ఒకటి. విక్రాంత్ రెడ్డి అనే కొత్త హీరో నటించిన ఈ సినిమా ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామాగా రూపొందగా, మెహ్రీన్, రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా వచ్చినట్టు కూడా చాలా మంది ఆడియన్స్ కి కూడా తెలీదు.

అయితే సినిమా చూసిన ఆడియన్స్ నుండి ఒకే ఒక్క మాట వినిపిస్తుంది. సినిమా ఓ రేంజ్ లో ఉంది. హీరో విక్రాంత్ ఎంత బాగా నటించాడంటే లెజెండ్ హీరో ని మించి యాక్ట్ చేసాడని అంటున్నారు.. అదేంటి లెజెండ్ బాలయ్యతో కొత్త హీరోకి పోలికా అని అనుకోకండి..

మనం చెప్పేది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన తమిళ్ డబ్ ఫిల్మ్ “ది లెజెండ్” గురించి. ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ హీరోగా నటించిన ఆ సినిమా అప్పట్లో ఎంత ట్రోలింగ్ కి గురయ్యిందో తెలిసిందే. అందరికంటే ఎక్కువగా శరవణన్ యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ గురించే ట్రోల్ చేసారు. ఇక తెలుగులో ఇప్పుడు రిలీజ్ అయిన “స్పార్క్” సినిమా హీరో విక్రాంత్ గురించి జనాలు అదే అంటున్నారు.

- Advertisement -

ఈ సినిమాలో విక్రాంత్ ఎక్స్ప్రెషన్స్ శరవణన్ ని బీట్ చేసేలా ఉన్నాయని అంటున్నారు. నవరసాలు పలికించడమేమో గాని, హీరో లవ్ చేసినా, ఫైట్ చేసినా, ఏడ్చినా, కోప్పడినా ఒకేలా ఉంటాడు. మూవీ మేకర్స్ సినిమా క్వాలిటీ మీద పెట్టిన శ్రద్ధ కన్నా, హీరో యాక్టింగ్ పైన కూడా పెట్టుంటే బడ్జెట్ లో సగమైనా రికవరీ అయ్యే ఛాన్స్ ఉండేదని నెటిజన్లు అంటున్నారు. ఒక రకంగా ఆడియన్స్ సినిమా బాగా లేదన్న విషయం కన్నా, హీరోని చూడలేకపోయామన్న బాధే ఎక్కువైనట్టుంది రివ్యూలు వింటుంటే..

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు