Star Hero Son: 17 ఏళ్లకే అలాంటి తప్పు చేసి పోలీసులకు పట్టుబడ్డ అప్ కమింగ్ హీరో..!

17 సంవత్సరాలున్న ఒక స్టార్ హీరో కొడుకు త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న సమయంలో ఈ అప్ కమింగ్ హీరో అలాంటి పని చేసి పోలీసులకు పట్టుబడడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. అయితే ఎవరా స్టార్ హీరో.. వారి కొడుకు ఎవరు..ఎందుకు పోలీసులకు పట్టుబడ్డారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రముఖ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఎన్నో చిత్రాలలో నటించి తమిళ్ ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఈయన తన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ ఇక్కడ కూడా భారీ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అలా తెలుగు, తమిళ్ అని తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకుంటున్న ధనుష్ త్వరలోనే తన కొడుకులను ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇలాంటి సమయంలో తాజాగా ధనుష్ ఇంటికి పోలీసులు వెళ్లడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది.

అసలు విషయంలోకెళితే ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర హెల్మెట్ లేకుండా బైకు నడిపినందుకు 1000 రూపాయల జరిమానా విధిస్తూ.. ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. అయితే ఇలా పోలీసులు వారి ఇంటికి వెళ్లడానికి కారణం సోషల్ మీడియా కూడా ఉందని చెప్పాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాత్ర వీడియో చెన్నైలోని పోయేస్ గార్డెన్ ఏరియాలో తీసినట్టుగా తెలుస్తోంది. అక్కడ ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర బైక్ రైడింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

- Advertisement -

ఇక దానిని చూసిన పోలీసులు వెంటనే ధనుష్ ఇంటికి వెళ్లి ఫైన్ వేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన ధనుష్ కుటుంబ సభ్యులు యాత్ర బైక్ రైడింగ్ నేర్చుకుంటున్నాడని, అతడి వెంట ట్రైనర్ కూడా ఉన్నారని వారి కుటుంబ సభ్యులు వివరించారు. అయితే హెల్మెట్ లేకుండా బండి నడపకూడదని, అందుకుగాను జరిమానా విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇకపోతే ట్రాఫిక్ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించిన తీరును చూసి సోషల్ మీడియాలో వారిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు సామాన్యులకే కాదు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయని మరొకసారి నిరూపించారు చెన్నై పోలీసులు. మొత్తానికి అయితే అప్ కమింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యాత్ర ఇలా హెల్మెట్ లేకుండా పట్టుబడడంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు