Dhanush: మొదటిసారి బయోపిక్ లో

ఒక గొప్ప సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించినంతగా ఎవరు ఆదరించరు అనేది వాస్తవం. అందుకే చాలామంది తమిళ్ హీరోలు కూడా ఇక్కడ తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతుంటారు. ఇప్పుడు హీరోస్ లో విశాల్, సూర్య, కార్తీ, ధనుష్, విజయ్, శివ కార్తికేయన్ ఇలా చాలామంది తమిళ్ హీరో సినిమాలకు ఇక్కడ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు.

ఇకపోతే “రఘువరన్ బీటెక్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ధనుష్ ఇక్కడ ప్రేక్షకులకు కూడా తమ వాడు అయిపోయాడు. రీసెంట్ గా “సార్” సినిమాతో తెలుగులో కూడా డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు ధనుష్. ధనుష్ సినిమా ఏది రిలీజ్ అయిన కూడా తెలుగు ప్రేక్షకులు ఉత్సాహంతో థియేటర్ కి వెళ్లి మరి చూస్తుంటారు. ధనుష్ సినిమాలను ఎంచుకునే విధానం దీనికి కారణం. చాలామంది హీరోల్లో కొన్ని మల్టీ టాలెంటెడ్ థింగ్స్ ఉంటాయి.

ధనుష్ విషయానికొస్తే డైరెక్షన్, రైటింగ్, సింగింగ్ ఇలా చాలా టాలెంట్స్ ధనుష్ లో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ధనుష్ కొంత మేరకు ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. దాదాపు ధనుష్ 50 సినిమాలను పూర్తి చేశాడు. ఇప్పటివరకు తను చేసిన ఏ సినిమాల్లో కూడా ఒక బయోపిక్ అంటూ లేదు. కానీ ఫస్ట్ టైం ధనుష్ ఒక బయోపిక్ సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ లో ధనుష్ నటించినబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే ధనుష్ కి కూడా ఆ పాత్రలో ఒదిగిపోయే సామర్థ్యం ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ధనుష్ లో కేవలం రైటింగ్ స్కిల్స్ మాత్రమే కాకుండా సింగింగ్ స్టిల్స్ కూడా బానే ఉన్నాయి. ఇప్పటివరకు ధనుష్ చాలానే పాటలను పాడాడు. ఒక ప్రొఫెషనల్ సింగర్ ఎలా పాడుతాడో ధనుష్ పాడితే అలా ఉంటుంది.

ఇకపోతే ఈ సినిమా 2024లో స్టార్ట్ అయ్యి 2025 లో రిలీజ్ అవుతుంది అని వార్తలు వస్తున్నాయి. దీనికంటే ముందు ధనుష్ చేయవలసిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో చేయవలసిన ప్రాజెక్ట్ ఇంకా మొదలు కూడా కాలేదు. వీటన్నిటిని పూర్తి చేసుకొని 2025 ఇళయరాజా బయోపిక్ తో వస్తాడా అనేది డౌట్. వీటన్నిటికంటే ముందు అసలు బయోపిక్ మాట ఎంతవరకు వాస్తవం అనేది ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ వస్తే కానీ తేల్చలేము.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు