Best Foods For Dinner: డిన్నర్ కోసం బెస్ట్ ఫుడ్స్ ఇవే..!

నైట్ టైమ్ ఫుడ్ లైట్ గా తీసుకోవాలన్నది మనందరికీ తెలిసిన విషయమే కానీ, తక్కువ ఫుడ్ తీసుకోవాలన్న ధ్యాసలో బాడీ సరిపడా ఫుడ్ తీసుకోక చాలా మంది అనారోగ్యం పాలవుతుంటారు. అలా అనారోగ్యం బారిన పడకుండా హెల్తీగా ఉండాలంటే ఇప్పుడు చెప్పబోయే ఫుడ్స్ ని క్రమం తప్పకుండా డిన్నర్ లో తీసుకోవటం అలవాటు చేసుకోండి.

సాల్మన్ ఫిష్:

నిపుణుల చెబుతున్న దాని ప్రకారం వారానికి రెండు, మూడు రోజులు డిన్నర్ లో సాల్మన్ ఫిష్ తీసుకోవటం మంచిది. సాల్మన్ ఫిష్ లో బ్రెయిన్ కి కావాల్సిన మల్టీ విటమిన్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కోలైన్ వంటి మినరల్స్ బాడీకి హై క్వాలిటీ ప్రోటీన్స్ అందించటంలో దోహదపడతాయి. సాల్మన్ ఫిష్ ని రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల స్లీప్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

స్వీట్ పొటాటో:

హెల్తీ డైట్ లో స్వీట్ పొటాటోస్ తప్పనిసరిగా సూచిస్తుంటారు నిపుణులు. వీటిలో మన బాడీకి కావాల్సిన విటమిన్ A, ఫైబర్ 280 శాతం ఎక్కువగా ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు. స్వీట్ పొటాటోస్ లో హార్ట్ హెల్త్ ని మెరుగుపరిచే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతే కాకుండా స్వీట్ పొటాటోస్ రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల కంటి సమస్యలకి దూరంగా ఉండచ్చని డాక్టర్స్ చెప్తున్నారు.

- Advertisement -

శనగలు:

శనగల్లో చాలా ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుందని చాలా అధ్యయనాల్లో తేలింది. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ వీటిలో పుష్కలంగా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. హెల్తీ డిన్నర్ తీసుకోవాలని భావిస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మనం తీసుకునే ఏ వెరైటీ ఫుడ్ లో అయినా వీటిని మెయిన్ డిష్ గానో సైడ్ డిష్ గానో యాడ్ చేసుకుంటే ఎన్నో లాభాలు పొందొచ్చు.

ఆకుకూరలు:

ఆకుకూరల్లో కావాల్సినంత ఐరన్, ఫైబర్, పొటాషియం, విటమిన్ A,C,K ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ లో యాంటీ యాక్సిడెంట్స్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. చెడు కొలెస్ట్రాల్ ని దూరం చేసి, బ్లడ్ ప్రెజర్ ని అదుపులో ఉంచుతుంది. మనం వాడే రిఫైన్డ్ ఆయిల్ కి బదులు ఆలివ్ ఆయిల్ ని వాడటం వల్ల చాలా లాభాలు పొందొచ్చు.

టమోటా:

మనం నిత్యం వాడే టమోటా వల్ల కూడా చాలా లాభాలున్నాయి. వీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో తోడ్పడతాయి. అంతే కాకుండా క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రమాదకర సమస్యల నుండి కూడా దూరంగా ఉండటంలో హెల్ప్ అవుతాయి.

క్యాబేజీ:

క్యాబేజీ వల్ల చాలా రకాల ఉపయోగాలున్నాయి. క్యాబేజీని రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల చాలా ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి దూరంగా ఉండచ్చని డాక్టర్స్ సూచిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు