Dhanush: శేఖర్ కమ్ముల – ధనుష్ సెట్స్ కి వెళ్ళేది అప్పుడేనంట

నీటిలో ఉండే చేప పిల్లకు ఎప్పుడు జలుబు చేయనట్లు సినీ పరిశ్రమలో ఉండి కూడా ఎటువంటి ఆడంబరాలకి పోనీ దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది శేఖర్ కమ్ముల. అమెరికాలో చదువుకొని తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల ,ఎనలేని మక్కువను పెంచుకొని ఇండియాకు తిరిగి వచ్చి డాలర్ డ్రీమ్స్ తో తన సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.
“ఆనంద్” సినిమాతో మంచి దర్శకుడుగా గుర్తింపును సాధించాడు శేఖర్.

“తెలుగు సినిమాల యందు శేఖర్ కమ్ముల సినిమాలు వేరయా” అనటం అతిశయోక్తి కాదు.  శేఖర్ కమ్ముల అనగానే టక్కున గుర్తొచ్చే సినిమాలు ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్ అని చెప్పుకుంటూ వెళ్లొచ్చు.  శేఖర్ కమ్ముల సినిమాలో ఉన్న ఫీల్, శేఖర్ కమ్ముల అమ్మాయిని చూపించే విధానం, స్త్రీకి ఇచ్చే వాల్యూ, స్త్రీని ఇండిపెండెంట్ చూపించే విధానం ఇవన్నీ శేఖర్ కమ్ముల  సినిమాలో స్పెషాలిటీ.

శేఖర్ కమ్ముల నుంచి చివరగా వచ్చిన చిత్రం “లవ్ స్టోరీ”. నాగచైతన్య , సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టి అద్భుతమైన విజయాన్ని సాధించింది.  ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు శేఖర్ కమ్ముల నుంచి ఒక సినిమా కూడా రాలేదు.
బేసిగ్గా శేఖర్ కమ్ముల సినిమాకి కొంత గ్యాప్ తీసుకుని చెయ్యాలి, అని కాకుండా తనకు చెప్పాలి అనిపించే థాట్ ను సినిమాగా తీస్తాడు.

- Advertisement -

అయితే ధనుష్ శేఖర్ కమ్ముల సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులైంది.  ఆ సినిమా గురించి ఇప్పటివరకు అప్డేట్ అంటూ లేకుండా పోయింది.  అయితే ఎట్టకేలకు ధనుష్ సినిమాకి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.  ఈ సినిమా 2024 జనవరిలో ముంబైలోని తదితర ప్రాంతాల్లో స్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఇదివరకే తెలుగులో కూడా మంచి మార్కెట్ సాధించిన ధనుష్ ఈ సినిమాతో మరిన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడని చెప్పొచ్చు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే శేఖర్ కమ్ముల దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు