Keeda Kola: అనుకున్నాం అంతే అడగలేదు

తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కీడాకోలా. నవంబర్ 3న ఈ సినిమా థియేటర్లో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. చాలా ఏళ్ల తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి, ఈ సినిమా కోసం చాలామంది ఆడియోన్స్ వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం ఈ సినిమా కంటే ముందు తరుణ్ భాస్కర్ డైరెక్షన్ చేసిన “పెళ్లిచూపులు”, “ఈ నగరానికి ఏమైంది” సినిమాలు ఇంపాక్ట్ అని చెప్పొచ్చు.

తరుణ్ తీసినవి రెండే సినిమాలు అయినా కూడా, అవి ఇప్పటికీ చూసినా కూడా బోర్ అనిపించకుండా నవ్వు తెప్పిస్తుంటాయి. అందుకని తరుణ్ భాస్కర్ సినిమా కోసం ఇంతలా పడిగాపులు కాస్తూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రముఖ పాత్రలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ పాత్ర కంటే ముందు అల్లు అరవింద్ ఈ పాత్ర చెయ్యాల్సి ఉందని చాలా వార్తల్లో కథనాలు వినిపించాయి.

వీటిపై తాజాగా స్పందించాడు తరుణ్ భాస్కర్. మొదట బ్రహ్మానందం గారు చేసిన పాత్ర కోసం మురళీధర్ గౌడ్, అల్లు అరవింద్ అని అనుకున్నామని, కానీ అల్లు అరవింద్ గారిని అసలు అడగలేదని చెప్పుకొచ్చాడు. తరుణ్ ఇకపోతే నటుడుగా కూడా అల్లు అరవింద్ కి కొద్దిపాటి అనుభవం ఉంది. ఇకపోతే రీసెంట్ గా “ఫస్ట్ డే ఫస్ట్ షో” సినిమా ప్రోమోషన్ కోసం ఒక ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ ఎంత ఫన్ క్రియేట్ చేశారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

- Advertisement -

అనుదీప్ కేవి తో పాటు వంశీతో కలిసి ఆ ఇంటర్వ్యూలో పండించిన కామెడీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అల్లు అరవింద్ లో ఇంత మంచి టైమింగ్ ఉందా.? అని అనిపించేలా చేసిన ఇంటర్వ్యూ అది. ఇకపోతే మురళీధర్ గౌడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది పనిలేదు. రీసెంట్ టైమ్స్ లో నటుడుగా మంచి పేరును సాధించుకున్నాడు మురళీధర్ గౌడ్. డీజే టిల్లు లో డాడీ పాత్రలో నటించి అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చాడు. అలానే బలగం సినిమాలో కూడా మంచి పర్ఫామెన్స్ చూపించాడు. ఏదేమైనా మొత్తానికి బ్రహ్మానందం ని తరుణ్ భాస్కర్ ఎందుకు ఎంచుకున్నాడు.? అనేది నవంబర్ 3న క్లారిటీ వస్తుంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు