Tollywood Hero: వాస్తు దోషం – ఇల్లు మారుతున్న సీనియర్ హీరో..!

టాలీవుడ్ హీరోల్లో అందరికంటే జాతకాలు, శాస్త్రాల పట్ల ఎక్కువ నమ్మకం ఉన్న హీరో బాలకృష్ణ. సినిమాల్లో కాకుండా బయట ఎక్కడ కనిపించినా బాలయ్య మెడలో రుద్రాక్ష మాలలు, చేతి వేళ్ళకు రంగురాళ్ల ఉంగరాలు, చేతికి రకరకాల దారాలు తప్పకుండా ఉంటాయి, అంతటి ప్రాధాన్యత ఇస్తాడు బాలకృష్ణ. వాస్తు శాస్త్రాన్ని కూడా బాగానే ఫాలో అవుతాడు బాలక్రిష్ణ.

ఆ మధ్య తనకు కలిసి రాకపోవటానికి కారణం వాస్తు దోషమే అని భావించిన బాలయ్య, ఇల్లు మారాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో బాలక్రిష్ణకు వరుస బ్లాక్ బస్టర్స్ పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అప్పట్లో వరుస ఫ్లాప్స్ తర్వాత సింహ, లెజెండ్ వంటి హిట్స్ అందుకున్న బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత వరుస డిజాస్టర్స్ వచ్చాయి.  ఆ తర్వాత అఖండ, వీర సింహారెడ్డి, రీసెంట్ భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇల్లు మారాలని అనుకుంటున్న తరుణంలో ఇలా వరుస హిట్స్ పడటంతో బాలయ్య కూడా కన్ఫ్యూజన్ లో పడ్డాడని తెలుస్తోంది.

- Advertisement -

అయితే, వాస్తు దోషం ఉన్నప్పటికీ బాలక్రిష్ణకు వరుస హిట్స్ పడటం వెనక మరో కారణం ఉందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అదేంటంటే అఖండ సినిమా సమయం నుండి బాలకృష్ణ బొటన వేలికి తొడుక్కుంటున్న ఉంగరం అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి కలిసిరాలేదని ఇల్లు మారాలని డిసైడ్ అయిన సమయంలో వరుస హిట్స్ పడటం బాలకృష్ణను సంశయంలో పడేసిందనే చెప్పాలి. ఇప్పుడు వాస్తు శాస్త్రాన్ని నమ్మి ఇల్లు మారతాడా లేక ఆ ఆలోచన విరమించుకుంటాడా అన్నది చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు