Bhagavanth Kesari: హాఫ్ సెంచరీ దాటిన కేసరి – బ్రేక్ ఈవెన్ అతి చేరువలో..!

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన భగవంత్ కేసరి ఇటీవలే రిలీజయ్యి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ, శ్రీలీల మధ్య సెంటిమెంట్ వర్కౌట్ అవ్వటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

బాలయ్య మార్క్ మాస్ యాంగిల్ ని పక్కన  పెట్టి ఈ సినిమాలో సటిల్ యాక్టింగ్ తో ఆకట్టుకోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తాను ఎంటర్టైనర్స్ కి మాత్రమే పరిమితం కాదని ప్రూవ్ చేశాడు. ఫస్ట్  షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే 50కోట్లకు పైగా షేర్, 100కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సత్తా చాటి బాలకృష్ణకు హ్యాట్రిక్ అందించింది ఈ సినిమా.

భగవంత్ కేసరి బ్రేక్ ఈవెన్ అవ్వటానికి ఇంకా 19కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. దసరా సందర్బంగా రిలీజైన లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించని నేపథ్యంలో భగవంత్ కేసరి సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వటం పెద్ద కాష్టమేమీ కాదని చెప్పచ్చు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో హ్యటిక్ హిట్ అందుకోవటం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అయితే, కలెక్షన్స్ పరంగా ఈ సినిమా వీరసింహారెడ్డిని క్రాస్ చేయటం అంత ఈజీ కాదు. సంక్రాతి టైమ్ లో ఉన్నంత రష్ దసరా సమయంలో ఉండకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. మొత్తానికి గట్టి పోటీలో దసరా విన్నర్ గా నిలిచిన భగవంత్ కేసరి బ్రేక్ ఈవెన్ అయ్యి ఏ రేంజ్ లో ప్రాఫిట్స్ తెచ్చి పెడుతుందో వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు