#LeoScam: విజయ్ గ్రాఫ్ డ్యామేజ్… సొంత ఇండస్ట్రీ నుంచే…

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హ్యాహ్ ట్యాగ్ #LeoScam. లియో మూవీ యూనిట్ చూపిస్తున్న కలెక్షన్లు అన్నీ ఫేక్ అని, తమ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని, కోట్లల్లో కలెక్షన్లు వస్తున్నట్టు ఆడియన్స్ ని మేకర్స్ నమ్మిస్తున్నారు అంటూ నెటిజన్లు ఈ #LeoScam హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ… విజయ్ పైన, లియో సినిమాపైన ట్రోల్స్ చేస్తున్నారు.

లియో సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 400+ కోట్ల వరకు కలెక్షన్లు వచ్చినట్టు మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు. అయితే ఎక్కడా కూడా థియేటర్స్ ఫిల్ అవ్వడం లేదు.. అలాంటి టైంలో 400 కోట్లు ఎలా సాధ్యం అయ్యాయి అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అలాగే కలెక్షన్ల విషయంలోనే కాదు… టికెట్ బుకింగ్ వెబ్ సైట్స్ లోనూ లియో యూనిట్ స్కామ్ చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఫాస్ట్ ఫిలింగ్ మోడ్ అని చూపించి… లియో సినిమాకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. అటు ఓవర్సీస్ లో కూడా #LeoScam నడుస్తుందట.

ఓవర్సీస్ లో ఏకంగా 18 మిలియన్ డాలర్లు వచ్చాయని మూవీ మేకర్స్ చెప్పుకుని తిరుగుతున్నారు. అయితే అందులోనూ నిజం లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సొంత ఇండస్ట్రీ కోలీవుడ్ లోనూ అదే పరిస్థితి ఉంది. కాగా, లియో సినిమాకు ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. కానీ, నెగిటివ్ టాక్ రావడం, సినిమా అంచనాలను అందుకోకపోవడంతో ఆడియన్స్ థియేటర్స్ వైపునకు వెళ్లడం లేదు.

- Advertisement -

అయితే #LeoScam హ్యష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న సమయంలో విజయ్ ఫ్యాన్స్… #LeoHits500crores , #LeoIndustryHit అనే హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు.

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు