Anil Ravipudi: బాలయ్య కెరియర్ లో మరో వందకోట్లు సినిమా

పటాస్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్, తన మొదటి సినిమాతోనే మంచి పేరును సాధించాడు. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సుప్రీమ్ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పటివరకు అనిల్ రావిపూడి చేసిన ఏ సినిమా కూడా బాక్సా ఫీస్ వద్ద ఫెయిల్ కాలేదు. తను చెప్పాలి అనుకున్న కథను ఎంటర్టైన్మెంట్ వే లో చెప్తూ కొన్ని సీన్స్ తో ఆడియన్స్ కి హై ఇస్తాడు అనిల్.

రీసెంట్ గా అనిల్ రావిపూడి చేసిన సినిమా “భగవంత్ కేసరి”. ఈ సినిమా దసరా కానుకగా రిలీజై కలక్షన్స్ ను కొల్లగొడుతుంది. బాలకృష్ణ లాంటి స్టార్ హీరో తో ఎంటర్టైన్మెంట్ వే లో గుడ్ టచ్ ,బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్ తో మంచి మెసేజ్ ఇచ్చాడు అనిల్. రీసెంట్ టైమ్స్ లో నందమూరి బాలకృష్ణ మంచి సినిమాలను ఎంచుకుంటున్నాడు అని చెప్పొచ్చు.

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వేరు. అందులో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ ఒకటి ఇప్పటివరకు వీరి కాంబినేషన్స్ లో వచ్చిన సింహా , లెజెండ్ , అఖండ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ బాలయ్య కెరియర్ అయిపోయింది అనుకున్న తరుణంలో ఈ సినిమాలు ఊపిరి పోశాయి.

- Advertisement -

అఖండ తరువాత బాలయ్య చేసిన వీరసింహ రెడ్డి , ఇప్పుడు భగవంత్ కేసరి తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు బాలయ్య. భగవంత్ కేసరి సినిమా 100 కోట్లు కలక్షన్స్ ను సాధించింది. దసరా బరిలో రిలీజైన సినిమాలు అన్నిటిలో భగవంత్ కేసరి విజయవంతంగా కొనసాగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు