Benefits of Pumpkin: గుమ్మడికాయతో ఇన్ని ఉపయోగాలా? హెయిర్, హెల్త్, బ్యూటీ ఇంకా ఎన్నో…

హెయిర్ గ్రోత్ కోసం, అందం పెరగడానికి అనేక రకరకాలుగా కెమికల్స్ తో కూడిన క్రీమ్స్ వాడుతారు.ఇక హెల్త్ కోసం అయితే డాక్టర్స్ చెప్పినవి, చెప్పనివి అన్నీ వాడేస్తారు. కానీ, అందరికీ అందుబాటులో ఉండే గుమ్మడికాయతో కూడా హెయిర్ గ్రోత్ చేసుకోవచ్చని, అందంగా కనిపించొచ్చని, హెల్తీగా ఉండొచ్చని చాలా తక్కువ మందికి తెలుసు. నిజానికి గుమ్మడికాయ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎవరికీ తెలియదు. ఎక్కువ మంది గుమ్మడికాయను ఆహారానికి ఉపయోగిస్తారు. ఇంకా ఎక్కువ మంది దిష్టి తియ్యడం అంటూ ఇంకా ఏవేవో వాటికి వాడుతారు. కానీ, గుమ్మడికాయను సరిగ్గా వాడితే, కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు.

గుమ్మడి కయ వల్ల ఉన్న ప్రయోజనాలు:

1. ఆస్తమా ట్రీట్మెంట్

- Advertisement -

గుమ్మడికాయలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను కూడా సులభంగా నయం చేసే గుణాలు ఉంటాయి. గుమ్మడికాయలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ను తగ్గించి, మెల్లగా ఆస్తమా ని కూడా తగ్గిస్తుంది.

2. డ్రై స్కిన్ ట్రీట్మెంట్

డ్రై స్కిన్ ట్రీట్మెంట్ కోసం ఒక స్పూన్ ఉడకపెట్టిన గుమ్మడికాయ గుజ్జుని అర స్పూన్ తేనేతో కలిపి అందులో అర స్పూన్ పాలు కలిపి మెత్తని మిశ్రమంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద రాసుకొని 10 నుంచి 15 నిముషాలు పాటు ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. వెంటనే మోయిస్తూరిజర్ ను రాసుకోవాలి.

3. ఆయిలీ స్కిన్ ట్రీట్మెంట్

ఈ గుమ్మడికాయ వల్ల చర్మం పైన ఆయిల్ అనేది ఉత్పత్తి కాకుండా సహాయపడుతుంది. ఇందుకోసం గుమ్మడికాయ గుజ్జుని ఒక స్పూన్, కొంచం ఆపిల్ సిడర్ వెనిగర్ ని కలిపి . ఆ మిశ్రమాన్ని మొఖం పై పేస్ ప్యాక్ లా రాసుకొవాలి. ఆ తరువాత 30 నిమిషాల ఆగి, అది బాగా ఆరిపోయిన తరువాత గోరువెచ్చని నీటి తో శుభ్రపరచుకోవాలి.

4. డార్క్ స్పాట్స్ ట్రీట్మెంట్

గుమ్మడికాయ మన చర్మం పై వచ్చే డార్క్ స్పాట్స్ ని దూరం చేసుకొనేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ట్రీట్మెంట్ కోసం ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి కయ గుజ్జు ని, ఒక టేబుల్ స్పూన్ పలు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం, అలాగే ఒక టీస్పూన్ విటమిన్ E ఆయిల్ ని కలిపి మెత్తటి మిశ్రమం లా కలిపి ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం పై రాసుకొని బాగా డ్రై ఆయె వరకు 30 నిమిషాలు ఉంచి గోరు వెచ్చని నీటితో శుభ్రపరచుకోవవలి.

5. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్

ఈ గుమ్మడికాయ లోని గుణాలు యాంటీ ఏజింగ్ కు కూడా ఉపయోగపడుతాయి. ఈ గుమ్మడికాయ లో విటమిన్ C ఎక్కువ మోతాదు లో ఉంటుంది. ఇది హానికరం అయిన సూర్య కిరణాల వల్ల ఏర్పడిన స్కిన్ డామేజ్ ని రిపేర్ చేస్తుంది. ఇది మన శరీరం లో కొల్లాజెన్ ని ఉత్పత్తి చేసి నిత్య యవ్వన సౌందర్యాన్ని ఇస్తుంది.

6. గుమ్మడికాయ బాడీ ప్యాక్

గుమ్మడికాయ కేవలం ముఖ సౌందర్యం కోసమే కాకుండా, బాడీ ప్యాక్ గా కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక కప్పు ఉడకపెట్టిన గుమ్మడికాయ గుజ్జు ని ఒక కప్పు కొబ్బరి పేస్ట్ ని, అరకప్పు దాల్చిన చక్క పొడి కలిపి మిశ్రమంగా కలుపుకోవాలి. ఆ తరువాత దీన్ని బాడీ మీద అప్లై చేసుకొని 10 నిముషాలు ఉంచి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి.

7. హెయిర్ గ్రోత్ సీక్రెట్

గుమ్మడికాయ లోని గుణాలు హెయిర్ ఫాల్ ను తగ్గించేందుకు ఎంతగానో సహాయ పడుతుంది. గుమ్మడికాయలో ఆల్ఫా కెరోటిన్, పోటాషియం, జింక్ గుణాలు హెయిర్ గ్రోత్ ని పెంపొందించి, కొల్లాజెన్ ని ఉత్పత్తి చేస్తుంది. గుమ్మడికాయ గింజల నుంచి వచ్చే ఆయిల్ తో హెయిర్ గ్రోత్ పెరుగుతుంది.

గుమ్మడికాయ వల్ల ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో విటమిన్స్, మినరల్స్, ఆంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ C, విటమిన్ A, విటమిన్ E, ఫ్లవోనోయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లో కెరోటినాయిడ్స్, మరియు లుటీన్. అలాగే మినరల్స్ లో ఐరన్, కాపర్, పోటాషియం, క్యాల్షియం, మరియు ఫాస్పారోస్ ఉంటాయి.

8. కెలొరీస్

ఈ గుమ్మడికాయని ఎన్నో రకాల డైట్ లో చేర్చుకోవచ్చు. ఇందులో చాలా తక్కువ క్యాలోరిస్ ఉండటం వల్ల డైట్ బ్యాలన్స్ చేయటం లో చాలా ఉపయోగపడుతుంది.

9. యాక్నే ట్రీట్మెంట్

గుమ్మడికాయను ఇలా వాడితే ఎంత కలం నుంచి యాక్నేతో బడా పడుతున్న సరే అతి త్వరలో ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. గుమ్మడికాయ తినటం వల్ల, అలాగే ముఖం పైన రాసుకున్నా సరే, ఇందులో ఉన్న విటమిన్ B, నియాసిన్, రిబోఫ్లావిన్, B6 బ్లడ్ సర్క్యూలేషన్ పెరిగి, స్కిన్ డామేజ్ తగ్గించి, యాక్నేకు దూరం చేస్తుంది.

10. ఆరోగ్యకరమైన హార్ట్

గుమ్మడి కయలో యాంటీ ఆక్సిడెంట్స్ గుండెని బలపరిచి బ్లడ్ ప్రెషర్ నార్మల్ గ ఉండేందుకు సహాయ పడుతుంది. అలాగే ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో కూడా ఉపయోగపడుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు