Raviteja’s Next Movie: రవితేజతో వినాయక్ సినిమా – రిజల్ట్ రిపీట్ అయ్యేనా..?

డైరెక్టర్ వివి వినాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమర్షియల్ సినిమాల్లో ఒక కొత్త ట్రెండ్ కి నాంది పలికాడు అప్పట్లో. ఒక దశాబ్దం పాటు వరుస హిట్స్ తో టాప్ డైరెక్టర్ గా కొనసాగిన వినాయక్ కి ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోవటంతో చాలా గ్యాప్ వచ్చింది.
గ్యాప్ తర్వాత చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150తో హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు డైజెస్టర్స్ అవ్వటం వల్ల వినాయక్ కెరీర్ మళ్ళీ మొదటికి వచ్చింది. సాయిధరమ్ తేజ్ తో తీసిన ఇంటెలిజెంట్ సినిమా బిగెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఛత్రపతి రీమేక్ తో చేసిన బాలీవుడ్ ఎంట్రీ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక వినాయక్ కెరీర్ ఆల్మోస్ట్ ముగిసినట్టే అనుకుంటున్న తరుణంలో ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
మాస్ మహారాజ రవితేజతో వినాయక్ సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో కృష్ణ లాంటి బ్లాక్ బస్టర్ ఉన్న నేపథ్యంలో ఈ వార్త ఆసక్తిగా మారింది. ఇటీవల టైగర్ నాగేస్వరరావు సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ రాగా, ప్రస్తుతం డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో చేయబోయే సినిమాతో బిజీ అవనున్నాడు రవితేజ.
రవితేజ, గోపీచంద్ కాంబినేషన్లో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి బ్లాక్ బస్టర్స్ ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన నాటి నుండే ఇంట్రస్టింగ్ గా మారింది. ఈ సినిమా తర్వాత క్రాక్2 సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. దీంతో వినాయక్ రవితేజ సినిమా పట్టాలెక్కాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మరి, ఆసక్తి పెంచుతున్న ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ, ఈ సినిమాతో అయినా వినాయక్ బ్లాక్ బస్టర్ అందుకొని కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు