Bhagavanth Kesari: చిచ్చాకు డోస్ పెంచారు… ఇక దబిడి దిబిడే !

నందమూరి బాలయ్య నటించిన భగవంత్ కేసరి మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మొదటి షో నుంచే పాజిటివ్, హిట్ టాక్ రావడం, అదే సమయంలో లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు యావరేజ్ టాక్ రావడంతో ఆడియన్స్ బాలయ్య సినిమా వైపునకు వస్తున్నారు. దీంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో దంచవే మేనత్త కూతురా.. అనే సాంగ్ రీమిక్స్ చేశారన్న విషయం తెలిసిందే. నాలుగున్నర నిమిషాలు ఉన్న ఓ సాంగ్ చివరన ఈ రీమిక్స్ ను యాడ్ చేశారు. అయితే భగవంత్ కేసరి రిలీజ్ అయినప్పుడు ఈ సాంగ్ మాత్రం కనిపించలేదు. నిడివి ఎక్కువ అవుతుందని, పాటకు స్టోరీకి సంబంధం లేదనే ఉద్దేశ్యంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సాంగ్ ను పక్కనబెట్టేశాడు.

లక్షలు ఖర్చు చేసిన ఈ పాటకు దాదాపు 50 మందికి పైగా డ్యాన్సర్లు పని చేశారట. అంతే కాదు, ఈ పాట కోసం ప్రత్యేకంగా ఓ సెట్ ను కూడా వేశారట. అంత భారీగా షూట్ చేసినా, స్టోరీకి లింక్ లేకపోవడంతో సాంగ్ మొత్తాన్ని పక్కనబెట్టేశారట.

- Advertisement -

అయితే సినిమాకు ప్రస్తుతం మంచి టాక్ రావడంతో ఈ సాంగ్ ను మళ్లీ యాడ్ చేశారు. సాంగ్ మొత్తం కాకుండా, చివరలో వచ్చే దంచవే మేనత్త కూతురా.. అని సాగే రీమిక్స్ ను మాత్రమే సినిమాలో యాడ్ చేశారు. అయితే ఇక్కడ మరో చిక్కు ఉంది. ఈ రీమిక్స్ సాంగ్ ను సినిమా మధ్యలో కాదు.. సినిమా చివరలో రోలింగ్ టైటిల్స్ టైంలో వచ్చేలా డైరెక్టర్ ప్లాన్ చేశాడు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు