#Thalapathy68: సీనియర్ హీరోయిన్ స్నేహ ఏంటి ఎలా మారిపోయింది

సీనియర్ హీరోయిన్ స్నేహ అంటే ఇప్పటి తరం ఆడియన్స్‌కి పెద్దగా పరిచయం లేదు. కానీ, 2000 నుంచి సినిమాలు చేసే వారికి మాత్రం ఆ ఫేస్ ఎప్పుడూ గుర్తు ఉంటుంది. వెంకీ, సంక్రాంతి, శ్రీ రామదాసు, ఏవండోయ్ శ్రీవారు లాంటి ఎన్నో సినిమాల్లో నటించిన స్నేహ.. ఒకప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్. ఒకే ఏడాదిలోనే 7 నుంచి 8 సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండేది.

2012లో తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకున్న తర్వాత స్పీడ్ తగ్గించి సెలెక్టెడ్ పాత్రలు మాత్రమే చేస్తూ ఉండేది. తర్వాత స్నేహ సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంది. అయితే ఛాన్స్ లు వచ్చినప్పుడు తల్లి, సోదరి పాత్రలు చేయడానికి కూడా రెడీ అయిపోయింది. అలా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన వినయ విధయ రామ సినిమాలో చరణ్ కి వదిన పాత్రలో కనిపించింది.

ఈ సినిమా అనుకున్నంత విజయం కాలేకపోయినా, స్నేహను మాత్రం తెలుగు ఆడియన్స్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూశారు. దీని తర్వాత ఇతర ఇండస్ట్రీలో స్నేహకు అవకాశాలు వచ్చాయి. తాజాగా ఈ రోజు స్నేహ పేరు సోషల్ మీడియాలో ఒక్క సారిగా వైరల్ అయింది. కారణం ఏంటంటే… స్నేహ తమిళంలో మరో సినిమా చేయబోతుంది.

- Advertisement -

విజయ్ దళపతి, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో Thalapathy68 అనే మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో స్నేహ కనిపించబోతుంది. ఈ రోజు Thalapathy68 మూవీ పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్నేహ హజరైంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు.. స్నేహ ఏంటి ఇంత మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల స్నేహ పలు టీవీ షోలకు కూడా వచ్చింది. అప్పటికీ ఇప్పటికీ స్నేహలో చాలా మార్పులు వచ్చాయి. అయితే Thalapathy68 సినిమా కోసమే స్నేహ ఇలా మారిపోయిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్ భార్య పాత్రలో స్నేహ నటిస్తుందని ఓ టాక్ వస్తుంది. అయితే ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి కూడా ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు