Bhagavanth Kesari: రవితేజ వర్సెస్ బాలకృష్ణ – ఈసారి సీన్ రివర్స్ అయ్యింది..!

నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజ రవితేజ మధ్య గతంలో చాలాసార్లు ఆసక్తికర పోటీ జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఇద్దరి సినిమాలు పోటీ పడిన ప్రతిసారి రవితేజాదే పైచేయిగా నిలిచింది. కానీ, ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన భగవంత్ కేసరి, రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలు దసరా సందర్బంగా రిలీజ్ అయ్యాయి.

భగవంత్ కేసరి సినిమాకు ఫస్ట్ షో నుండే పాజిటివ్ రెస్పాన్స్   అందుకొని బ్లాక్బస్టర్ దిశగా దూసుకుపోతుంది. టైగర్ నాగేశ్వరరావు సినిమాకి ఫస్ట్ షో నుండే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో రవితేజ పర్ఫామెన్స్, యాక్షన్ సీన్స్ డైలాగ్స్, సినిమాటోగ్రఫీ బాగున్నప్పటికీ 3 గంటల నిడివి ఉండటం, ఫాస్ట్ హాఫ్ లో అవసరం లేని లవ్ ట్రాక్ ఉండటంతో ఈ సినిమా ఆడియెన్స్ ని ఎంగేజ్ చేయలేకపోయింది.

అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్యకి భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ దక్కింది. రావణాసురతో డిజాస్టర్ చవిచూసిన రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్ వచ్చి చేరింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ కి ముందు మంచి హైప్ క్రియేట్ అయినప్పటికీ ఆశించిన స్థాయిలో థియేటర్స్ దక్కకపోవడం వల్ల నెగిటివ్ టాక్ ప్రభావం కలెక్షన్స్ మీద కూడా పడిందని చెప్పాలి.

- Advertisement -

మొత్తానికి భగవంత్ కేసరి సినిమా దసరా రేసులో విన్నర్ గా నిలిచినందుకు నందమూరి ఫ్యాన్స్ లో ఆనందం నెలకొంది.రెండురోజులు గాను సుమారు 50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన భగవంత్ కేసరి ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు