Kamsaraju: పవర్ఫుల్ రోల్ లో ‘ఆదిపురుష్’ నటుడు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరేలేదు. మూడు నెలల కింద రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో రకాల విమర్శలని ఎదుర్కొనగా, నటీనటుల పెర్ఫార్మన్స్ విషయంలో గట్టెక్కింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా, ఈ సినిమాలో రాముడిని మించి ఎలివేట్ అయింది మాత్రం హనుమాన్ పాత్రకే.

ఇక ఆదిపురుష్ లో హనుమాన్ పాత్ర చేసిన దేవదత్త నాగే కూడా తనకిచ్చిన పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. మరాఠీ ఇండస్ట్రీకి చెందిన ఈ నటుడు ఆదిపురుష్ లో హీరోని మించి ఎలివేట్ కాగా, ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంన్నాడు. తాజాగా ‘అశోక్ గల్లా’ హీరోగా నటిస్తున్న రెండో సినిమాలో దేవదత్త నాగే ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడని మూవీ మేకర్స్ కంఫర్మ్ చేసారు.

“కంసరాజు” అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో దేవదత్త నటిస్తున్నాడని ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా చెప్పగా, ఆ పాత్ర విలన్ రోలా, లేక ఏదైనా స్పెషల్ రోలా అనేది మాత్రం తెలీదు. కానీ రిలీజ్ చేసిన ఆ పోస్టర్ లో దేవదత్త సూపర్ గా ఉన్నాడు. ఇక అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ కథని అందిస్తుండగా, అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేస్తున్నాడు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు