Bhagavanth Kesari: రివ్యూయర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనిల్ రావిపూడి..!

అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందిన భగవంత్ కేసరి సినిమా ఇటీవలే రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.   ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ లో భాగంగా ప్రెస్ మీట్ కండక్ట్ చేసింది సినిమా యూనిట్. ఈ సినిమా గురించి ఇచ్చిన ఒక రివ్యూలో హీరోయిన్ శ్రీలీల నుండి ఫ్యాన్స్ ఆశించే డ్యాన్స్ లు గ్లామర్ షో ఈ సినిమాలో మిస్ అయ్యిందని రాసిన దాని గురించి ప్రస్తావించగా స్పందించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి రివ్యూయర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తండ్రి కూతురి రిలేషన్ మీద తీసిన సినిమాలో అందులోను ఆర్మీ కి వెళ్లే హీరోయిన్ క్యారెక్టర్ నుండి కూడా డ్యాన్స్ లు గ్లామర్ షో ఆశిస్తున్నాడంటే అతని మానసిక స్థితి ఎలాంటిదో అర్థమవుతుందని అన్నారు.
రివ్యూస్ ని నమ్మనని మౌత్ టాక్ నే నమ్ముతానని క్లారిటీ ఇచ్చాడు. రివ్యూవర్స్ పై అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా,ఈ సినిమాలో శ్రీలీల పర్ఫామెన్స్ కి ఆడియెన్స్ ఫిదా అవ్వటమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుతున్నాయి. తన జానర్ ని పక్కన పెట్టి బాలకృష్ణతో సటిల్ పర్ఫామెన్స్ రాబట్టినందుకు అనిల్ రావిపూడికి కూడా అప్లాజ్ దక్కుతోంది.
అఖండ, వీరసింహారెడ్డి వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత భగవంత్ కేసరి రూపంలో బాలయ్యకి హైఅట్టిక్ దక్కిందని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి పోటీగా రిలీజైన లోకేష్, విజయ్ ల లియో సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ రావటం, శుక్రవారం రిలీజైన రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ రావటంతో ఈసారి దసరా విన్నర్ బాలకృష్ణ అనే చెప్పాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు