Sree Leela: రెమ్యునరేషన్ లో కాజల్ ను దాటేసిన యంగ్ హీరోయిన్ శ్రీలీల

నటసింహం నందమూరి బాలయ్య నుంచి తాజాగా వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ప్రీమియర్ ల నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే మొదటి రోజు 32.33 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించిన సంగతి తెలిసిందే. బాలయ్యకు కూతురు పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీలీల కనిపించింది.

అయితే ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల యాక్టింగ్ కు మంచి మార్కులు పడుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో శ్రీలీల చేసే ఫైట్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక నుంచి శ్రీలీల యాక్షన్ సినిమాలు చేసినా, ప్రేక్షకులు క్యూ కట్టి చూసేలా ఆమె ఫర్మామెన్స్ ఉందని సినీ విమర్శకులు కూడా అభిప్రాపడుతున్నారు. ఇది ఇలా ఉండగా, భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది.

భగవంత్ కేసరిలో సీనియర్ హీరోయిన్ కాజల్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుందట శ్రీలీల. ఈ సినిమాకు గాను కాజల్ కేవలం 1.08 కోట్ల పారితోషికం తీసుకుందట. కానీ, యంగ్ సెన్షెషన్ శ్రీలీల మాత్రం ఏకంగా 1.5 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుందట. దీంతో శ్రీలీల ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సీనియర్ హీరోయిన్ కాజల్ ని మించి పోయిందని అభిమానులు అంటున్నారు. అలాగే ఇది స్టార్టింగ్ మాత్రమే అని, త్వరలోనే టాలీవుడ్ కు మాత్రమే కాదు, పాన్ ఇండియా స్థాయిలో శ్రీలీలనే నెంబర్ వన్ హీరోయిన్ అవుతుందని ఆమె ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు