Sree Leela: శ్రీలీలా లో మరో యాంగిల్ బయటకు వచ్చింది.

సినిమా ఇండస్ట్రీ లో బేసిగ్గా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఒక సినిమా హిట్ అయితే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
అదే సినిమా ప్లాప్ అయితే వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి తిరుగుతాయి. కానీ ఒక యంగ్ హీరోయిన్ విషయంలో ఇది కొంచెం డిఫరెంట్ గా జరిగింది, తనే శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగులో హీరోయిన్గా అడుగుపెట్టిన ఈమె మొదటి సినిమా ఫెయిల్ అయినా కూడా వరుస అవకాశాలను అందుకుంది.

స్టార్ హీరోల సరసన కూడా నటించే అవకాశాలను సాధించింది.
పెళ్లి సందడి సినిమా ఫెయిల్ అయిన తర్వాత కూడా శ్రీలీలాకు అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. ధమాకా సినిమా శ్రీలీలాకు మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది. ప్రస్తుతం శ్రీలీలా చేతిలో పదికి పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. దీంట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం కూడా ఒకటి.

అయితే శ్రీలీలా అనగానే ఇప్పుడు చాలామందికి టక్కును గుర్తొచ్చేది ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్. కానీ నిన్న రిలీజ్ అయిన “భగవంత్ కేసరి” సినిమా తర్వాత శ్రీలీలాలో మరో యాంగిల్ కూడా ఉందని ఆడియన్స్ కి తెలిసి వచ్చింది. తను యాక్షన్ సీక్వెన్స్ చేసిన విధానం ఆడియన్స్ ని సప్రైజ్ చేసింది. అనిల్ రావిపూడి క్లైమాక్స్ లో ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ను డిజైన్ చేసిన విధానం, అవన్నీ శ్రీలీలాలో మరో యాంగిల్ ని బయటకు తీసాయి. కేవలం డాన్సులు మాత్రమే కాకుండా నటనతో పాటు యాక్షన్ లో కూడా తాను పర్ఫెక్ట్ అని శ్రీ లీల నిరూపించుకొని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు