Sreeleela: శ్రీలీల హ్యాండ్ ఆ సినిమాకు కూడా బాగానే కలిసొచ్చింది

Sreeleela

మోస్ట్ హప్పెనింగ్ యాక్ట్రెస్ శ్రీలీల పట్టిందల్లా బంగారమైపోతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తున్న శ్రీలీల కేవలం ఆమె చేస్తున్న సినిమాలకే కాదు పలు మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా ఆమె హ్యాండ్ బాగానే కలిసొస్తుంది.

హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తేజ మార్ని దర్శకత్వంలో రాబోతున్న సినిమా కోటా బొమ్మాలి పోలీస్ స్టేషన్. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టైన నయట్టు అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలోని మొదటి పాటను నిన్న సాయంత్రం హీరోయిన్ శ్రీలీల రిలీజ్ చేసింది.

శ్రీకాకుళం ఫోక్ సాంగ్ ట్యూన్ బేస్ చేసుకొని కంపోజ్ చేసిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఆకట్టుకునే డాన్స్ స్టెప్స్ తో ఇన్స్టంట్ ఈ పాట హిట్టై సినిమా ప్రమోషన్స్ కు బాగా కలిసొచ్చింది. లింగి లింగి లింగిడి అనే హుక్ లైన్ తో సాగే ఈ పాటకు రఘు కుంచె లిరిక్స్ అందించారు. గీతాఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

ఇటీవలనే హిట్టైన బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య తో గణేష్ చవితి స్పెషల్ బీట్ లో స్టెప్స్ వేయించిన విజయ్ పోలంకి ఈ పాటకు కొరియోగ్రఫీ చేసారు. ప్రస్తుతం చార్ట్ బస్టర్ నిలిచిన ఈ లింగిడి పాటకు వస్తోన్న రెస్పాన్స్ ను బట్టి చూస్తే శ్రీలీల కేవలం ఆమె చేస్తున్న సినిమాలలో హీరోయిన్ గా మాత్రమే లక్కీ కాదు ప్రమోషన్స్ కూడా ఆమెది లక్కిహ్యాండే అని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు