Sree Leela: శ్రీలీల టైమ్ స్టార్ట్స్ – ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ ట్రీట్..!

Sree Leela

టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది యంగ్ హీరోయిన్ శ్రీలీల . సీనియర్ హీరో, యంగ్ హీరో అన్న తేడా లేకుండా అందరికీ ఫస్ట్ ప్రయారిటీగా మారింది ఈ కన్నడ భామ. ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాలను లైన్లో పెట్టి ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం టాలీవుడ్లో రిలీజ్ కానున్న ప్రతి సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల కనిపించనుంది. వినాయక చవితికి స్కంద సినిమాతో మొదలై శ్రీలీల మూవీ మారథాన్ వరుసగా ఐదు పండగల వరకు కొనసాగనుంది. బోయపాటి డైరెక్షన్లో రామ్, శ్రీలీల జంటగా నటించిన స్కంద సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకోగా శ్రీలీల సినిమాకి మెయిన్ అట్రాక్షన్ గా మారింది.

ఆ తర్వాత దసరా టైమ్ కి అనీల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న భగవంత్ కేసరి సినిమాలో కూడా శ్రీలీల కనిపించనుంది. బాలకృష్ణ సరసన కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల బాలయ్యకి కూతురుగా కనిపించనుంది. దీపావళి టైమ్ కి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించిన ఆదికేశవ రిలీజ్ కానుంది.

- Advertisement -

ఆ తర్వాత క్రిస్మస్ కి నితిన్ తో కలిసి నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా రిలీజ్ కానుంది.ఇక తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతికి త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాతో సందడి చేయనుంది శ్రీలీల.

ఇలా ప్రతి పండగకి రిలీజ్ అయ్యే సినిమాల్లో హీరో మారుతున్నప్పటికీ హీరోయిన్ మాత్రం శ్రీలీల కావటంతో ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ ట్రీట్ ఉండబోతోంది. ఏ హీరోయిన్ కి అయినా ఇలాంటి ఫీట్ సాధించటం చాలా రేర్ అనే చెప్పాలి. ప్రస్తుతం శ్రీలీల జోరు చూసి మిగతా హీరోయిన్స్ జెలసీ ఫీల్ అయ్యే పరిస్థితి నెలకొంది టాలీవుడ్లో.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు