Kangana Ranaut: కంగనా రనౌత్ చంద్రముఖి రోల్ పై జ్యోతిక ఆసక్తికర వ్యాఖ్యలు

Kangana Ranaut

2005 లో వచ్చిన చంద్రముఖి సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. రజనీకాంత్, నయనతార, హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో చంద్రముఖి టైటిల్ రోల్ ను జ్యోతిక పోషించింది. హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాదించటంతో పాటు హర్రర్ థ్రిల్లర్ జానర్ లోనే చంద్రముఖి ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది.

అయితే ప్రస్తుతం ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. చంద్రముఖి సినిమాను తెరకెక్కించిన పి వాసు నే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి పార్ట్ 2 డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలనే షూటింగ్ కూడా కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా సినిమా సెప్టెంబర్ 15న థియేటర్స్ లో విడుదలవబోతుంది. ఇక సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటించగా, చంద్రముఖి టైటిల్ రోల్ ను బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ పోషిస్తుంది.

లేటెస్ట్ గా కంగనా రనౌత్ చంద్రముఖి పాత్ర పోషించడంపై.. గతంలో ఆ క్యారెక్టర్ చేసిన హీరోయిన్ జ్యోతిక రియాక్ట్ అయింది. అంతేకాదు కంగనా పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. ఇటీవలనే చంద్రముఖి సినిమా పార్ట్ 2 ట్రైలర్ రిలీజై, ప్రేక్షకులను మెప్పిస్తుండగా, వచ్చే వారమే సినిమా రిలీజ్ కు రెడీ అయింది. దాంతో జ్యోతిక కంగనా రనౌత్ కు బెస్ట్ విషెష్ తెలియజేసింది. చంద్రముఖి సినిమా జ్యోతిక కెరీర్ లో ఎంత పెద్ద విజయం సాధించిందో, అలాగే కంగనా రనౌత్ కు కూడా చంద్రముఖి 2 అలాంటి సక్సెస్ ను అందించాలని ఆమె కోరుకుంది. ఇక జ్యోతిక ఇన్నిరోజులు సైలెంట్ గా ఉండి..కంగనా రనౌత్ ఈ రోల్ చేయడం పట్ల కరెక్ట్ గా సినిమా రిలీజ్ కు ముందు ఓపెన్ అవడంతో ఆమె విషెష్ కు ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు