Sai pallavi : చంద్రముఖి 2 సినిమాలో.. సాయి పల్లవి ..?

Sai pallavi

తలైవా రజినీకాంత్, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రల్లో 2005లో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చంద్రముఖి 2 అనే టైటిల్ తో పి.వాసు దర్శకత్వంలో కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ రాఘవ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఈ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది.

ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో చంద్రముఖి పాత్ర కోసం ముందుగా అనుకున్నది కంగనా రనౌత్ ని కాదట. చంద్రముఖి పాత్ర కోసం మొదట నాచురల్ బ్యూటీ సాయి పల్లవి అని అనుకున్నారట మూవీ యూనిట్.

తన కళ్ళతో హావాభావాలు పలికించగల హీరోయిన్లలో సాయి పల్లవి ముందు వరుసగా ఉంటుంది. అలాంటి సాయి పల్లవి అయితే చంద్రముఖి పాత్రకి సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావించారట. ఈ విషయంలో సాయి పల్లవి తో కూడా సంప్రదింపులు జరిపారట. కానీ ఈ అవకాశాన్ని ఆమె సున్నితంగా తిరస్కరించారట. దీంతో ఈ అవకాశం కంగనాని వరించింది. అయితే సాయి పల్లవి మొదటి నుంచి కూడా తాను ఎంచుకున్న పాత్రకు న్యాయం చేయగలను అనుకున్న వాటికే ఓకే చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె ఒప్పుకున్న సినిమాల కంటే రిజెక్ట్ చేసినవి ఎక్కువగా ఉంటాయి. మరి చంద్రముఖి పాత్రకు ఎందుకు నో చెప్పిందో తెలియదు కానీ.. కంకనా కూడా చంద్రముఖి పాత్రకి కరెక్ట్ గా సెట్ అయింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు