Dia Mirza: 5 ఏళ్లకే ఇంట్లో నుండి పారిపోయి.. స్టార్ హీరోయిన్ గా!

Dia Mirza

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న సెలబ్రిటీలలో దియా మీర్జా ఒకరు. హైదరాబాద్ కి చెందిన బ్యూటీ దియా మీర్జా రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అంతేకాదు ఫెమినా మిస్ ఇండియా టైటిల్ కూడా గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టి 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అక్కినేని నాగార్జునతో దియా మీర్జా వైల్డ్ డాగ్ అనే సినిమాలో కూడా నటించింది. తన ప్రతిభ ఆధారంగానే గుర్తింపు సాధించిన దియా గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మిస్ ఆసియా పసిఫిక్ గా నిలిచిన దియామీర్జా తల్లి బెంగాలీ కాగా.. ఆమె తండ్రి జర్మనీకి చెందినవారు. దియా పుట్టిన తర్వాత ఆమె తల్లి భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత ఆమె తల్లి హైదరాబాద్ కి చెందిన అహ్మద్ మీర్జాన్ ని పెళ్లాడింది. కానీ దియా ఇప్పటికీ తన సవతి తండ్రి పేరునే ఇంటిపేరుగా పరిగణిస్తుంది. అయితే దియా ఐదేళ్ల వయసులో ఉండగానే తన తండ్రిపై కోపం పెంచుకుంది. తండ్రి ఆమెను తిట్టడంతో ఇంటి నుండి పారిపోయి బంధువుల వద్దకు వెళ్ళింది.

ఆ తర్వాత ఆమె ఒక మీడియా సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసింది. నెలకు కేవలం 5000 జీతానికి పనిచేసింది. ఆ తర్వాత దియామీర్జా 2001లో “రెహ్నా హై తేరే దిల్ మే” సినిమాతో నేషనల్ అవార్డు విన్నింగ్ స్టార్ ఆర్ మాధవన్ సరసన నటించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రంలో తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది దియా మీర్జా. అయితే ఈమె తన వ్యక్తిగత జీవితంలో భర్త సాహిల్ తో విడిపోయిన తర్వాత వైభవ్ వహిల్ ను రెండో వివాహం చేసుకుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు