Indian 2: అందంగా కనిపించేందుకు..ఆ పనులు చేస్తున్న రకుల్ ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా పక్కువే అవుతుంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ అవకాశాలు అందుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ సౌత్ సినిమాలపై మనసు పడిందో ఏమో కానీ తరచుగా ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రోజుకు ఒక గ్లామర్ ఫోటోషూట్ పంచుకుంటూ నిత్యం హాట్ టాపిక్ గా మారుతుంది.

అయితే… రకుల్ తన అందం విడకుండా సీక్రెట్ ని తాజాగా బయటపెట్టింది. స్లిమ్ గా ఫీట్ గా ఉండటం కోసం జిమ్ లో బాగా కష్టపడే రకుల్ అందం కోసం బ్యూటీ పార్లర్ కి ఎక్కువగా వెళ్లేదట. గ్లామర్ ని పెంచుకోవడం కోసం ఎక్కువగా నేచురల్ రెమిడీస్ ని ట్రై చేస్తుందట. రకుల్ తన ముఖ సౌందర్యం కోసం రోజు విడిచి రోజు ప్యూర్ కొబ్బరి నూనెతో ముఖానికి, మెడకు మసాజ్ చేసుకుంటుందట.

అంతేకాకుండా ముఖం, మెడ మీద ట్యాన్ పోవడానికి టమాటోను రుద్దుకుంటుందట. అలాగే పెరుగులో పసుపు, శెనగపిండి కలిపి ప్యాక్ లా వేసుకుంటుందట. ఇవన్నీ రకుల్ బ్యూటీ వెనుకున్న రహస్యాలట. ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె కమలహాసన్ నటించిన ఇండియన్-2 సినిమాలో అవకాశం దక్కించుకుంది. మరొకవైపు ఆయలాన్ అనే చిత్రంలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు