Project K: బాబోయ్! ఇక తెలుగు సినిమాలు చేయను… ప్రభాస్ హీరోయిన్ షాకింగ్?

సినీ ప్రపంచంలో తెలుగు ఇండస్ట్రీకి ఉన్న క్రేజీ అంతా ఇంత కాదు. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ తో ఇటీవల వచ్చిన మరికొన్ని సినిమాల వల్ల ప్రపంచం మొత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు తిరిగి చూసింది. తెలుగు హీరోలతో, డైరెక్టర్లతో పని చేయాలని, బాలీవుడ్ నటీనటులే కాదు.. హాలీవుడ్ కి చెందిన ప్రముఖులు కూడా బహిరంగంగా చెబుతున్నారు. ప్రస్తుతం కూడా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు.

అయితే ఒక బాలీవుడ్ బ్యూటీ మాత్రం ఇకపై తెలుగు సినిమాలు చేయనని తెెగేసి చెబుతుందట. ఆమె ఎవరో కాదు… బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే. ఈ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా, రెమ్యునరేషన్ తీసుకుంటుంది. బాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లోనూ దీపికాకు ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఇంగ్లీష్ లో ఒక చిత్రం కూడా చేస్తుంది. అలాగే దీపికా ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కె లో హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా, హైదరాబాద్ కి వచ్చిన దీపికా పదుకునే ను ఒక టాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో పాటు ఒక బడా నిర్మాత కలిశారట. తాము తెలుగులో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నామని, దానిలో హీరోయిన్ గా చేయాలని దీపికాను అడిగారట. కానీ, దీపికా కనీసం స్టోరీ కూడా వినకుండానే రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది. అంతే కాదు.. బాబోయ్ ఒక మళ్లీ తెలుగు సినిమాలు చేయను అంటూ తెగేసి చెప్పేసిందట. ఈ మాటలకు ఆ స్టార్ డైరెక్టర్, ఆ బడా నిర్మాత షాక్ అయ్యారని సమాచారం. మొహంపైనే తెలుగు సినిమాలు చేయను అని చెప్పిన తర్వాత, ఏం చేయాలో తెలియక వాళ్లు తిరిగి వచ్చేశారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

- Advertisement -

అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు. కానీ, ఇది నిజమే అయితే, ప్రపంచ సినీ మార్కెట్ లో బాలీవుడ్ సినిమాల కంటే, తెలుగు సినిమాలకే మంచి గుర్తింపు ఉంది. తెలుగు సినిమాల్లో నటించి, హాలీవుడ్ దర్శకులు, నిర్మాతల దృష్టిలో పడొచ్చు. అలాంటిది, తెలుగు సినిమాలను వదిలేసి, ప్రస్తుతం ఎందుకు పనికి రాని సినిమాలు చేస్తున్న బాలీవుడ్ ను దీపికా ఎందుకు మొదటి ఆఫ్షన్ గా ఎంచుకుంటుందో అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు