Biggboss: సీజన్ లు మారిన యాంకర్ మారట్లేదు- నాగ్ హోస్టింగ్ పట్ల ఆడియెన్స్ లో వ్యతిరేకత

తెలుగులో బిగ్గెస్ట్ టివి రియాలిటీ షో బిగ్ బాస్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. సక్సెస్ ఫుల్ గా 6 సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం ఏడో సీజన్ కు ముస్తాబవుతోంది. కాగా ఇటీవలనే ఈ సీజన్ కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేసారు.

ఎటువంటి అప్డేట్ లేకుండా సడన్ గా రిలీజ్ చేసిన ఈ ప్రోమోలో ఎవరు హోస్ట్ చేస్తున్నారనే విషయంపై యాజమాన్యం క్లారిటీఇవ్వలేదు. దాంతో ఈసారి బిగ్ బాస్ షో హోస్ట్ మారడంటూ వార్తలు వచ్చాయి. కొత్తగా ఈ షో కు ఎవరు హోస్ట్ చేస్తారాణి సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గత నాలుగు సీజన్ల నుంచి అక్కినేని నాగార్జున నే ఈ షో హోస్ట్ చేస్తుండగా ఈసారైనా హోస్ట్ మారుతాడని అందరు ఎదురు చూడగా సీజన్ 7 లేటెస్ట్ అప్డేట్ మరోసారి బిగ్ బాస్ లవర్స్ ను నీరాశపరచిందనే చెప్పాలి.

- Advertisement -

అయితే బిగ్ బాస్ 7 కూడా నాగార్జుననే హోస్ట్ చేయబోతున్నట్టు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది. దీనికి సంబందించిన ప్రోమో షూట్ కూడా ఇప్పటికే జరిగిపోయింది. తొందరలోనే ఈ ప్రోమో రిలీజ్ కానుంది. కాగా నాగార్జున హోస్ట్ చేసిన మొదటి రెండు సీజన్స్ కాస్త పరవాలేదనిపించిన, ఇక తరువాత నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకుంటున్నాడు.

టివిలో టెలికాస్ట్ అయిన షో అసలు చూడకుండానే కంటెస్టెంట్స్ తో మాట్లాడటం, యాంకరింగ్ లో కూడా ఎనర్జీ తగ్గడం హోస్ట్ మార్చాలంటూ గత రెండు సీజన్ల నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రేక్షకుల కోరిక మేరకు యాజమాన్యం వేరే హీరోలను హోస్ట్ గా చేయించే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. నాగార్జున తప్ప ఇతర హీరోలెవరు ఈ షో హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో ఇంకా తప్పక మళ్ళీ నాగార్జునని హోస్ట్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు