RC16: రామ్ చరణ్ సినిమా పై వచ్చిన ఆ రూమర్ నిజమేనట !

గత కొద్దీ రోజులుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- బుచ్చి బాబు దర్శకత్వంలో రాబోతున్న సినిమాపై సోషల్ మీడియాలో తెగ రూమర్స్ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా భారీ స్థాయి పాన్ ఇండియా సినిమా అవడంతో ఈ సినిమాపై రోజుకో రూమర్ షికారు చేస్తుంది.

ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. రామ్ చరణ్ కు జోడిగా ఈ సినిమా బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటిస్తుండగా, హీరోయిన్ అంజలి, సునీల్, ఎస్ జె సూర్య తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇటీవలనే హైద్రాబాద్ లో మొదలైన ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం శంకర్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్ కల్ల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, ఆ తరువాత బుచ్చి బాబు సినిమా పట్టాలెక్కించదానికి చూస్తున్నాడు రామ్ చరణ్.

అయితే బుచ్చి బాబు రామ్ చరణ్ సినిమాపై వచ్చిన రూమర్స్ లో బాగా పాపులర్ అయిన వాటిలో ఒకటేమో విజయ్ సేతుపతి ఈ సినిమాలో ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నాడనేది మరియు ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించనున్నారని, అయితే వీటిలో రామ్ చరణ్ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించబోతున్న రూమర్ నిజమేనని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో కన్ఫామ్ చేసారు రెహ్మాన్. ఇక దీనిబట్టి చూస్తే విజయ్ సేతుపతి రూమర్ కూడా తొందర్లోనే కన్ఫామ్ అయ్యేలా ఉంది. ఏది ఏమైన రామ్ చరణ్ సినిమాను బుచ్చి బాబు ఎలాంటి కాంప్రమైజ్ లు లేకుండా భారీగానే ప్లాన్ చేస్తునట్టు వీటి ద్వారా తెలుస్తుంది.

- Advertisement -

heck Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు