indian2: సమంతతో అలా చేయడం చాలా ఇష్టం- కాజల్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతపై ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అయితే ఆశ్చర్యంగా కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలకు సమంత కూడా రియాక్ట్ అవడంతో ఈ కామెంట్స్ వైరల్ అవడానికి ప్రధాన కారణం అయ్యాయి.

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ట్ హీరోయిన్ వరుస సినిమాలు చేస్తూ పోయిన కాజల్ కు పెళ్లి అవడంతో సినిమాలకు దూరం అయింది. గౌతమ్ కిచ్లు అనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకున్న కాజల్ పెళ్లి తరువాత సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకొని ఇటీవలనే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం రజని కాంత్ హీరోగా వస్తోన్న ఇండియాన్-2 మరియు నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న భగవంత్ కేసరి సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ, సెకండ్ ఇన్నింగ్స్ లోను దూసుకుపోతుంది ఈ పంజాబీ బ్యూటీ.

అయితే కాజల్ స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే సమంత, తమన్నా, రకుల్ లు హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచమయ్యారు. అప్పట్లో స్టార్ హీరోల సినిమాలకు వీరు నలుగురే ఛాయిస్ గా ఉండేవారు దాంతో వీరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. తరుచుగా కలవడం, మాట్లాడుకోవడం లాంటివి చేసేవారు. అయితే శుక్రవారం రోజు కాజల్ తన ఇంస్టాగ్రామ్ లో చాట్ సెషన్ నిర్వహించగా, ఫ్యాన్స్ వీరినలుగురి ఫ్రెండ్ షిప్ గురించి ప్రశ్నలు అడగగా ఆమె ఈ విధంగా సమాధానంఇచ్చింది ” రకుల్, తమన్నా, సమంత వీరు ముగ్గరు నా బెస్ట్ ఫ్రెండ్స్ , వాళ్ళతో టైం స్పెండ్ చేయడం నాకెంతో ఇష్టం, మేము షూటింగ్ లేని సమయంలో బయట హోటల్స్ లో కలిసి టైం స్పెండ్ చేస్తామని చెప్పి వాళ్ళు నలుగురు కలిసి దిగిన ఫోటో ని పోస్ట్ చేయగా, ఆ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు