Spy: నిఖిల్ కి ఈ భామ నిజంగానే పడిపోయిందా?

టాలీవుడ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం “స్పై”. ఈ సినిమా జూన్ 29న వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ సినిమాకున్న పాజిటివ్ బజ్ వల్ల మొదటిరోజు భారీ ఓపెనింగ్స్ ను కొల్లగొట్టింది. వీకెండ్ లో మరిన్ని వసూళ్లతో పుంజుకోవాలని చిత్రయూనిట్ ప్రచారం కూడా బాగా చేస్తుంది. నిన్న మూవీ టీమ్ సక్సెస్ మీట్ ని కూడా పెట్టింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య మీనన్ కూడా సినిమాకోసం బాగానే కష్ట పడింది.

అయితే “స్పై” సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయితే ఈ భామకి దక్కలేదు. ఇకపోతే “స్పై” కి సంబంధించి అన్ని రకాల ప్రమోషన్లను చిత్ర యూనిట్ తో పాటు హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తుంది. తాజాగా స్పై మూవీ థియేటర్ రెస్పాన్స్ వీడియోలను కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో స్టేటస్ లు పెట్టింది ఈ భామ. అందులో భాగంగా నిఖిల్ ని ఉద్దేశించి పెట్టిన ఒక స్టేటస్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ స్టేటస్ లో “నిఖిల్‌తో ఇంట్రడక్షన్ సెన్స్‌ లో తన పైన ఉన్న ప్రేమ అవాస్తవం.” అని పెట్టి లవ్ సింబల్ కూడా పెట్టింది. ఇక ఈ స్టేటస్ చుసిన నెటిజన్లు చాలా మంది ఐశ్వర్య నిఖిల్ పడిపోయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే కొంతమంది ట్రేడ్ విశ్లేషకులు మాత్రం ఇది చాలా కామన్ పాయింట్. ఇలా చాలా మంది పెడుతుంటారు. దాన్ని వేరే విధంగా అర్ధం చేసుకోవాల్సిన పని లేదని అంటున్నారు. ఇక స్పై సినిమా కోసం దాని ప్రమోషన్ల కోసం చిత్ర యూనిట్ ఇంకా మేజర్ సిటీ ఏరియాల్లో ప్రచారం చేస్తున్నారు. వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు