The Eye: నడిరోడ్డుపై శృతిహాసన్ అలాంటి పనులు ?

తెలుగు పరిశ్రమలో శృతిహాసన్ క్రేజ్ మామూలుగా లేదు. కమల్ హాసన్ కూతురుగా అడుగుపెట్టి ఆనతి కాలంలోనే తనకంటూ సొంతంగా కష్టపడి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ సందడి అంతా ఇంతా కాదు. మిడిల్ ఏజ్ నుండి సీనియర్ హీరోల వరకు తానే మెయిన్ ఆప్షన్ గా ఉంది.

ఇప్పటికే చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలయ్య బాబు వీరసింహారెడ్డిలో నటించి మెప్పించింది. ఆమె టాలెంట్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల వరస చూస్తే మనకు అర్థమవుతుంది. కాగా, డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో శృతి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చాలాకాలంగా ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను కూడా శృతిహాసన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది. శృతిహాసన్ ప్రియుడు శాంతనుతో కలిసి ఎయిర్పోర్టులో మెరిసింది. ఇద్దరు కలిసి ఎయిర్పోర్టుకి వెళ్తున్నారు. శృతిహాసన్ బ్లాక్ కలర్ ను ఇష్టపడుతుంది. ఆమె చాలావరకు బ్లాక్ డ్రెస్ లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి బ్లాక్ డ్రెస్ లో దర్శనమిచ్చింది.

ఆ ఫోటోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఈ ఇద్దరు పబ్లిక్ లో రెచ్చిపోయారు. ఎయిర్పోర్ట్ వద్ద హగ్గులు ఇచ్చుకుంటూ రచ్చ చేశారు. ప్రియుడిని గట్టిగా కౌగిలించుకుంది శ్రుతి. ఆయా పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ శృతిహాసన్ పై మండిపడుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు