Mayapetika: పాపం ఎంతో కష్టపడింది.. అయినా ప్లాపే

పాయల్ రాజ్ పుత్ కి ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. పంజాబీ బ్యూటీ అయిన పాయల్ RX100 వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో అడుగుపెట్టినపుడు వరుస ఆఫర్లు క్యూ కడతాయని అందరు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అన్నీ గ్లామర్ రోల్స్ ఏ రాగా, పైగా అన్ని చిన్న సినిమాలే వచ్చాయి. మధ్యలో ఎదో కొసమెరుపులా వెంకీ మామ ఆఫర్ వచ్చింది. దాని వల్ల కూడా పెద్దగా ఒరిగిందేమి లేదు. అయినా వరుస ప్లాపులు ఈ అమ్మడిని వెంటాడాయి. తాజాగా పాయల్ మెయిన్ లీడ్ గా నటించిన మరో సినిమా కుడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

పాయల్ మెయిన్ లీడ్ గా కామెడీ నేపథ్యంలో మాయపేటిక అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. విరాజ్ అశ్విన్ హీరోగా సిమ్రత్ కౌర్ హీరోయిన్ గా నటించింది. అయితే జూన్30న విడుదలైన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా కోసం పాయల్ చాలా కష్టపడింది. సినిమా కి సంబంధించి ఏ అప్డేట్ కి అయినా దగ్గరుండి ప్రమోట్ చేసింది. పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సహా చిత్ర యూనిట్ తో కలిసి పెద్ద పెద్ద సిటీలకు, మాల్స్ కి వెళ్లి ప్రచారం చేసింది. పలు మీడియా ఇంటర్వ్యూ లు కూడా ఇచ్చింది.

అయినా ఈ అమ్మడికి అదృష్టం కలిసిరాలేదు. విడుదలైన ఫస్ట్ డేనే నెగిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకోగా, వీకెండ్ లోనైనా మంచి కలెక్షన్లు రాబడుతుందనుకుంటే అంతకు ముందే విడుదలైన స్పై, సామజవరగమన చిత్రాలు అడ్డుకట్ట వేశాయి. ఇక పాయల్ కి మళ్ళీ ఎప్పుడు ఏ దర్శకుడు కనికరిస్తాడో మరి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు