Satyam rajesh; వెన్నులో వణుకు పుట్టిస్తున్న పొలిమేర-2 టీజర్

కమెడియాన్ సత్యం రాజేశ్‌ హీరోగా నటించిన మా ఊరి పొలిమేర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జానర్ లో వచ్చిన ఈ సినిమా 2021లో లక్డౌన్ సమయంలో ఓటిటిలో రిలీజ్ అయింది. డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

గెటప్‌ శ్రీను, బాలాదిత్య, చిత్రం శ్రీను కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి కొనసాగింపుగా ప్రస్తుతం రెండో పార్ట్ ను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన మొదటి పార్ట్ సూపర్ హిట్ అవడంతో, ఇప్పుడు రాబోతున్న సెకండ్ పార్ట్ ను పార్ట్ -1 కు మించేలా ప్లాన్ చేసినట్టు టీజర్ ద్వారా తెలుస్తుంది. చంపితే తప్పు గాని బలి ఇస్తే తప్పు ఎలా అవుతుంది అనే డైలాగ్స్ ద్వారా సినిమా గత చిత్రంతో పోలిస్తే మరింత ఉత్కంఠ భరితంగా ఉండబోతుందని స్పష్టమవుతోంది.

శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బ్యానర్‌పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పొలిమేర మొదటి పార్ట్ ను తెరకెక్కించిన అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. డా. కామాక్షి భాస్కర్ల, రవివర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు