National Crush: శ్రీలీల వదిలేసిన సినిమాతో రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా..?

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నాగశౌర్య చలో సినిమాతో మంచి విజయాన్ని నమోదు చేసి ప్రస్తుతం పవన్ బాసిరెడ్డి దర్శకత్వంలో “రంగబలి” అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులం ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య కి జోడిగా యుక్తి తరేజా నటించింది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా నాగశౌర్య.. యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టాడు.
2018లో వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య – రష్మిక కాంబోలో వచ్చిన “ఛలో” సినిమా మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ సినిమాలో మొదట అనుకున్నది రష్మికని కాదట.
ఛలో సినిమా కోసం మొదట శ్రీలీలని సంప్రదించారట. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించలేనని చెప్పిందట శ్రీలీల. దీంతో ఈ అవకాశం రష్మికను వరించింది. ఈ విషయాన్ని నాగశౌర్య స్వయంగా వెల్లడించారు. అయితే ఈ విషయం తెలిసిన నెటిజెన్లు శ్రీలీల మంచి అవకాశాన్ని కోల్పోయిందని.. ఈ సినిమా గనుక ఒప్పుకొని ఉంటే ఎప్పుడో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక చలో సినిమా విడుదలైన మూడేళ్ల తర్వాత శ్రీలీల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇప్పుడు సుమారు 10 సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు