Mega Prince: వరుణ్ తేజ్ కూడా రీమేక్ చేస్తున్నాడా..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవదారి అర్జున సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత చిత్రం గని డిజాస్టర్ అవ్వటంతో కొంత కాలం గ్యాప్ తీసుకున్న మెగా హీరో ఇప్పుడు వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇటీవలే డింపుల్ క్వీన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ చేసుకున్న వరుణ్ తన లైనప్ లో ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో పడ్డాడు. గాండీవదారి అర్జున సినిమా తర్వాత ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఒక పాన్ ఇండియా సినిమా చేయనున్న వరుణ్ మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం అందుతోంది. గతంలో గడ్డలకొండ గణేష్ సినిమా కోసం రీమేక్ ని ఎంచుకున్న వరుణ్ మరొక రీమేక్ చేయనున్నాడని వార్తలొస్తున్నాయి.
ఈ ఏడాది బాలీవుడ్లో సూపర్ హిట్ గా నిలిచిన భూల్ భులాయా 2 సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. తమిళ సినిమా రాట్చసన్ కి రీమేక్ గా రాక్షసుడు సినిమా తీసి హిట్ అందుకున్న రమేష్ వర్మ ఆ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ కుదిరితే రాక్షసుడు సీక్వెల్ తర్వాత వరుణ్ తేజ్ తో భూల్ భులాయా2 రీమేక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. వరుణ్ తేజ్ గత చిత్రాలు గని, ఎఫ్3 ఆశించిన స్థాయిలో అలరించకపోవటంతో గ్యాప్ తీసుకొని ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రీమేక్ మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో మెగా హీరోలకు తెలుగు దొరకట్లేదా?, తెలుగు రచయితలపై నమ్మకం లేదా అన్న కామెంట్స్ వస్తున్నాయి.  రీమేక్ సినిమాలకు సక్సెస్ రేట్ కూడా తక్కువ ఉండటం మెగా అభిమానులను కలవరపెడుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ తెచ్చిన ఒత్తిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో రీమేక్ చేస్తున్నాడు అన్న వార్త రావటంతో మెగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఇంకా ఈ ప్రపోజల్ వరుణ్ తేజ్ వద్దకు వెళ్లలేదని, వరుణ్ తేజ్ ని సంప్రదించగా అతని నిర్ణయాన్ని బట్టి కథపై కసరత్తు మొదలు పెట్టాలని రమేష్ వర్మ ఆలోచిస్తున్నాడట.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు