Sree Leela: సినిమా టికెట్స్ కొనేది వారి కోసమే – శ్రీ లీల

టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శ్రీలీల పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. ఈ మూవీకి టాక్ సరిగ్గా రానప్పటికీ అమ్మడు పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. దీంతో రెండో చిత్రమే మాస్ మహారాజా రవితేజ పక్కన నటించే అవకాశం దక్కించుకుంది. వీరి కాంబోలో వచ్చిన ధమాకా మూవీ సూపర్ సక్సెస్ కావడంతో శ్రీలీలకు ఆఫర్లు వరుసగా క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజనుకు పైనే చిత్రాలు ఉన్నాయి. దీంతో ఫుల్ బిజీ అయిపోయింది. అయితే తాజాగా టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీ లీల ఆసక్తికరమైన వాక్యాలు చేసింది.

యంగ్ హీరోయిన్ శ్రీ లీల తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వాక్యాలు చేసింది. నిజం చెప్పాలంటే నేటికీ ఆడియన్స్ సినిమా విడుదలయ్యాక మొదటి రోజు టికెట్స్ ను హీరోల కోసమే కొంటున్నారు. నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను. సినిమా మొత్తం నేనే కనిపించాలని అనుకోను. మంచి పాత్ర దొరికితే చాలు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాను. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండడం లేదు అని చెప్పుకొచ్చింది టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీ లల.

కాగా, శ్రీలీలా, మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న SSMB28 లో అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో ఛాన్స్ కొట్టేసింది. అలాగే యువ హీరోలైన రామ్ పోతినేని, నితిన్, విజయ్ దేవరకొండ తో సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ బ్యూటీ.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు