Global Star: జపాన్ లోనే ఆ మ్యాజిక్ జరిగింది -ఉపాసన ప్రెగ్నెన్సీ పై రామ్ చరణ్!

సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బెస్ట్ కపుల్స్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఒకరు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా ఎదిగిపోయారు. మరోవైపు బిజినెస్ ఉమెన్ గా ఉపాసన సక్సెస్ సాధించారు. ఈ దంపతులు పదేళ్ల కిందటే పెళ్లి చేసుకున్నారు. కాగా.. రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా శ్రీనగర్ లో జి20 సమ్మిట్ లో అతిథిగా పాల్గొన్న రామ్ చరణ్ పుట్టబోయే తన బిడ్డపై చేసిన వాక్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ మాట్లాడుతూ…”యూరప్ నాకు ఇష్టమైన ప్రదేశం. ఇప్పుడు జపాన్ ఇష్టమైన దేశంగా మారింది. అక్కడి సాంస్కృతి, ప్రజలు అంటే ఇష్టం. ప్రస్తుతం నా భార్యకు ఏడో నెల ప్రెగ్నెన్సీ. అంతేకాదు మా బిడ్డకు జపాన్ తో సంబంధం ఉంది. ఎందుకంటే జపాన్ లోనే ఈ మ్యాజిక్ జరిగింది” అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. కాగా, గతేడాది అక్టోబర్ లో జపాన్ లో ఆర్ఆర్ఆర్ బృందంతో పాటు రామ్ చరణ్ పర్యటించారు.

ఆ సమయంలో చెర్రీతో పాటు ఉపాసన కూడా అక్కడికి వెళ్ళింది. ఈ దంపతులు జపాన్ లో కొన్ని రోజులు హాయిగా షికార్లు కొడుతూ సరదాగా గడిపారు. ఆ తర్వాత డిసెంబర్ 12న మెగాస్టార్ చిరంజీవి… ఉపాసన ప్రెగ్నెన్సీ విషయాన్ని అధికారికంగా చెప్పారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు