Power Star: స్పీడ్ పెంచిన పవన్ – ‘ఓజీ’ కి ఎక్కువ డేట్స్..!

రాజకీయాల నుండి గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి నాలుగు సినిమాలకు డేట్స్ కేటాయించాడు పవన్. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సుజిత్ డైరెక్షన్లో ‘ఓజీ’, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సముద్రఖని డైరెక్షన్లో సాయి ధరమ్ తేజ్ తో కలిసి వినోదాయ సీతాం కి రీమేక్ గా బ్రో సినిమాను లైన్లో పెట్టాడు పవన్. చాలా కాలం కిందట మొదలైన హరిహర వీరమల్లు సినిమాను పక్కన పెట్టిన పవన్ సుజిత్ డైరెక్షన్లో రానున్న ఓజీ మీదనే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఆ మధ్య విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను పెంచుతోంది.

డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్లు  పూర్తి చేసుకోగా, హైదరాబాద్ లో త్వరలో జరగబోయే నాలుగో షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. మాఫియా బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తుండటం ఫ్యాన్స్ కి ఆనందం కలిగిస్తున్నప్పటికీ, ఏ సినిమాకు కూడా 30, 40రోజులకు మించి డేట్స్ కేటాయించకపోవటం, వేగంగా షూటింగ్ చేస్తుండటం వల్ల సినిమా క్వాలిటీ పైన ప్రభావం పడుతుందా అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. మరో పక్క క్రిష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన హరిహర వీరమల్లు షూటింగ్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఆన్న చందాన సాగుతుండటంతో అబ్భిమానులు నిరాశలో ఉన్నారు. పవన్ తొలిసారి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండటంతో ఆ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు