Sreeleela : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో శ్రీలీల ?

Sreeleela

టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరో, హీరోయిన్ ఎవరంటే ప్రభాస్, మరియు శ్రీలీల అని చెప్పవచ్చు.  ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ ఇద్దరు కలిసి తొందరలోనే ఒక సినిమా చేయబోతున్నారట. అది కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమానే నట. వివరాల్లోకి వెళ్తే

మైత్రి మూవీస్ బ్యానర్ పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఒక చిత్రం రాబోతుంది. ఇటీవలనే దుల్కర్ సల్మాన్ తో సీతారామం సినిమాను తెరకెక్కించిన హను రాఘవపుడి ఆయన తరువాతి చిత్రం ప్రభాస్ తో చేస్తున్నాడు. వరల్డ్ వార్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన కథ చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల పేరును మేకర్స్ పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో గోల్డెన్ గా కొనసాగుతున్న శ్రీలీల దాదాపు 10 సినిమాలలో నటిస్తోంది. ఈ సినిమాలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ కూడా అవబోతున్నాయి. అయితే ఈ సినిమాలన్నీ కూడా పెద్ద సినిమాలే అవడంతో ఆయా రిలీజ్ ల తరువాత శ్రీలీల ప్రేక్షకులను మరింతగా దగ్గరవబోతుంది. అందుకే ప్రభాస్ సినిమాలో కూడా శ్రీలీల ను తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నరట మేకర్స్. మరి ఇదే గనక నిజం అయితే శ్రీలీల త్వరలోనే పాన్ ఇండియా హీరోయిన్ అవ్వబోతుందన్న మాట.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు