Kangana Ranaut: మహేష్ బాబు తో సినిమా చేయనందుకు ఇప్పటికి బాధపడుతున్న..

Kangana Ranaut

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ దృష్టి ఉన్నట్టుండి సౌత్ ఇండస్ట్రీపై మళ్లింది. దర్శకుడు పి వాసు డైరెక్షన్ లో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కలిసి నటిస్తున్న చిత్రం చంద్రముఖి 2.

2005 లో రజినీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలనే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తెలుగు, తమిళ్ భాషల్లో చంద్రముఖి సినిమాకుప్రత్యేకమైన క్రేజ్ ఉండటంతో చంద్రముఖి2 సినిమా ప్రమోషన్స్ ను రెండు భాషల్లోనూ జోరుగా చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ ప్రమోషన్స్ లో హీరోయిన్ కంగనా రనౌత్ కూడా చురుగ్గా పాల్గొంటుంది. ఇక ఈ ప్రమోషన్స్ భాగంగా కంగనా సౌత్ హీరోలపై మరియు దర్శకులపై పలు ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలనే యస్ యస్ రాజమౌళి తన ఫెవరెట్ దర్శకుడని అలాగే హీరో రామ్ చరణ్ సినిమా చేయాలనివుందని తన మనసులో కోరికను బయట పెట్టిన కంగనా లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ మీడియా తో పంచుకుంది.

- Advertisement -

అదేంటంటే పోకిరి సినిమాలో నిజానికి కంగనా రనౌత్ నటించాల్సి ఉండిందట. కానీ అదే సమయంలో ఆమెకు బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు ఒక సినిమా రావడంతో.. ఆ క్షణంలో ఆమె పోకిరి సినిమా కాకుండా బాలీవుడ్ సినిమాలో నటించిందట. తరువాత పోకిరి సినిమా రిలీజై.. పెద్ద హిట్ అవడంతో పోకిరి సినిమాలో నటించనందుకు చాలా బాధపడిందట. ఇక ఆ తరువాత పూరి జగన్నాథ్ ఏక్ నిరంజన్ సినిమాతో ఆమెను టాలీవుడ్ కు పరిచయం చేసాడు.

అయితే ఆ సినిమా ఫ్లాప్ అవడంతో కంగనా రనౌత్ కు టాలీవుడ్ నుంచి పెద్దగా అవకాశాలు రాలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు ఆమె చంద్రముఖి 2 సినిమాతో ఆమె సౌత్ స్క్రీన్ లపై కనిపించబోతుంది. మరి ఈ సినిమాతోనైన కంగనా సౌత్ ఇండస్ట్రీ లలో బిజీ అవుతుందో లేదో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు